చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికి గాను యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఖాళీలు:
యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు మొత్తం 1,010
ట్రేడులు
కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్ టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్ఏఏ
అర్హతలు:
ట్రేడును బట్టి కనీసం 50శాతం మార్కులతో పదవ తరగతి సంబంధిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
15ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం:
నెలకు రూ. 6000 నుంచి 7,000వరకు స్టైఫండ్ చెల్లిస్తారు.
ఎంపిక:
అకాడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు.
ముఖ్యమైన తేదీలు:
22 మే 2024 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 21 జూన్ 2024 తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ.