Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSరైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. సికింద్రాబాద్ లో 1500 ఖాళీలు

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. సికింద్రాబాద్ లో 1500 ఖాళీలు

దేశవ్యాప్తంగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. మొత్తం 9970 అసిస్టెంట్​ లోకో పైలెట్​ పోస్టులు భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ పోస్టులకు ప్రారంభ వేతనం రూ.19,900. ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు 2025 ఏప్రిల్‌ 12 నుంచి మే 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు టెన్త్ తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసినవారూ అర్హులే.  అభ్యర్థులు 2025 జులై 1వ తేదీ నాటికి 18-30 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 9,970, సికింద్రాబాద్​ రీజియన్​ లో 1500 ఖాళీలున్నాయి.

దరఖాస్తు ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక ప్రక్రియ:
ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం:
సీబీటీ-1కు 60 నిమిషాల సమయం ఉంటుంది. 75 ప్రశ్నలు, 75 మార్కులు కేటాయించారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. మ్యాథ్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. సీబీటీ-2లో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-ఏ విభాగానికి 90 నిమిషాల వ్యవధి, 100 ప్రశ్నలు; పార్ట్‌-బి విభాగానికి 60 నిమిషాల వ్యవధి, 75 ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పార్ట్‌-ఏలో మ్యాథ్స్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌; పార్ట్‌-బిలో సంబంధిత ట్రేడ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీ ఖాళీలు: 
1. అహ్మదాబాద్- 497
2. అజ్‌మేర్- 820
3. ప్రయాగ్‌రాజ్‌- 588
4. భోపాల్‌- 664
5. భువనేశ్వర్- 928
6. బిలాస్‌పూర్- 568
7. చండీఘడ్‌- 433
8. చెన్నై- 362
9. గువాహటి- 30
10. జమ్ము అండ్‌ శ్రీనగర్- 08
11. కోల్‌కతా- 720
12. మాల్దా- 432
13. ముంబయి- 740
14. ముజఫర్‌పూర్- 89
15. పట్నా- 33
16. ప్రయాగ్‌రాజ్- 286
17. రాంచీ- 1,213
18. సికింద్రాబాద్- 1,500
19. సిలిగురి- 95
20. తిరువనంతపురం- 148
21. గోరఖ్‌పూర్- 100

దరఖాస్తు తేదీలు:
? ప్రారంభం: ఏప్రిల్ 12, 2025
? ముగింపు: మే 11, 2025
? దరఖాస్తుల సవరణ: మే 14, నుంచి మే 23 వరకు
పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.. Official Website

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!