Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSపోస్టల్​ డాక్ సేవక్ 30041 పోస్టులు

పోస్టల్​ డాక్ సేవక్ 30041 పోస్టులు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో 1058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి.

పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. టెన్త్ మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం రావాలి. వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం చెల్లిస్తారు.

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. నాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాల

డాక్‌ సేవక్‌: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.

దరఖాస్తులు: అభ్యర్థులు ఆగస్టు 23 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.indiapostgdsonline.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

13 COMMENTS

  1. Ee job lo join atyarante me future nashanam ainatte . Already working experience tho chepthunna .. ureskunnate ikadki vaste

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!