HomeLATEST300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇదే!

300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇదే!

జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా వివిధ కేటగిరీల్లో 300 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల కోసం ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అధికారిక వెబ్ సైట్ careers.ntpc.co.in ద్వారా 2023, జూన్‌ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు : 300

పోస్టుల : ఎలక్ట్రికల్‌ విభాగంలో 120 ఖాళీలు, మెకానికల్‌ విభాగంలో 120, మరియు ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో 60 చొప్పున పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు :

అభ్యర్థులు బీఈ/బీ.టెక్‌ లో కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే పాస్‌ మార్కులు ఉంటే సరిపోతుంది.

వయో పరిమితి : ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకోనే అభ్యర్థులకు కనీస వయసు 35 ఏళ్లు గా నిర్ణయించారు. ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

జీతభత్యాలు : నెలకు రూ. 60 వేలు నుంచి 1,80,000 లక్షల వరకు వేతనం అందించనున్నారు.

ఎంపిక విధానం : ఈ పోస్టులకు అభ్యర్థులను నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము : రూ. 300 దరఖాస్తు రుసుము చెల్లించాలి.(, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళలకు రుసుము నుంచి మినహయింపు ).

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!