తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ లైన్‌మెన్ (1553), అసిస్టెంట్ ఇంజినీర్ (48) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 నుంచి పూర్తి నోటిఫికేషన్ ఆఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉండనుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్‌మెన్ ఖాళీలకు రాత పరీక్షతోపాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
మొత్తం పోస్టులు: 1601
జూనియర్ లైన్‌మ్యాన్: 1553
అర్హత: పదో తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 48 పోస్టులు
అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
