హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో 10 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు ప్రకటించారు.
విద్యార్హతలు:
టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ/ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర విద్యార్హతలు కలిగిన వారు ఎవరైనా ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2, 2023 ఉదయం 10.00-6.00 గంటల వరకు..
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం: మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లి
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన ఫొటోలోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
కావాల్సిన ధ్రువపత్రాలు:
- బయోడేటా
- ఆధార్ కార్డు
- విద్యార్హత సర్టిఫికేట్లు
- ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు (గతంలో పని చేసిన/చేస్తున్న వారు)
- స్పోర్ట్స్ సర్టిఫికేట్లు (క్రీడాకారులు)
- 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
-అభ్యర్థులు ఇతర వివరాలకు 6301717425, 6301716125 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Job details good