జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో నెలకొన్న అయోమయానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెరదింపింది. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫైనల్ కీ వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 19వ తేదీన మెయిన్స్ ఫలితాలను ప్రకటిస్తామని ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫలితాల వెల్లడిపై నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయింది.
ఏప్రిల్ 17న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జేఈఈ మెయిన్ తుది విడత పేపర్-1 ఫైనల్ కీను వెబ్సైట్లో పెట్టిన ఎన్టీఏ.. గంట వ్యవధిలోనే దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించింది. దీంతో ఈనెల 17న ర్యాంకులు విడుదల చేస్తామని చెప్పిన ఎన్టీఏ విఫలమైందన్న విమర్శలు వెలువడ్డాయి.

జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ తొలి విడత 10 షిఫ్ట్‌ల(10 ప్రశ్నపత్రాలు)లో ప్రాథమిక, తుది విడత కీ మధ్య 13 జవాబులు మారాయి. అందులో ఆరు ప్రశ్నలను తొలగించారు. ఏప్రిల్‌లో జరిగిన తుది విడతలో 10 షిఫ్ట్‌ల్లో 12 జవాబులు మారాయి. అందులో ఒక ప్రశ్నను తొలగించారు. అయితే ఫైనల్ కీపై పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ విద్యార్థులు చాలా మంది ఈమెయిల్స్ పంపించారు. దీంతో ఫిర్యాదులకు తావు లేకుండా ఎన్టీఏ ఫలితాల వెల్లడికి జాగ్రత్తలు తీసుకుంది.
ఈనెల 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ జరగనుంది. అంటే జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ రాసేందుకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే రేపు ఏప్రిల్ 19న తుది ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
అడ్వాన్సుడ్ పరీక్షల ఫలితాలు వెల్లడించిన అనంతరం ఎన్టీఏ విద్యార్థుల మెరిట్ లిస్ట్, ఆల్ ఇండియా ర్యాంకుల లిస్ట్ రూపొందిస్తుంది. ఈ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా దేశంలో ఉన్న NITలు, IIITలు, GFTIల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ జూన్ లో ప్రారంభమవుతుంది.
? ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు
- ఎన్టీఏ అఫిషియల్ వెబ్సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయండి
- “JEE Main 2025 Session 2 Result” లింక్‌పై క్లిక్ చేయండి
- అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ లేదా పాస్వర్డ్ నమోదు చేయండి
- స్కోర్‌కార్డ్‌లో సబ్జెక్ట్ వారీగా స్కోర్లు, మొత్తం పర్సంటైల్, మరియు AIR (All India Rank) ఉంటాయి
? ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
---|---|
సెషన్ 2 పరీక్షలు | ఏప్రిల్ 2–9, 2025 |
ఫైనల్ కీ.. ఆన్సర్ షీట్ల విడుదల | ఏప్రిల్ 18, 2025 |
ఫలితాల వెల్లడి | ఏప్రిల్ 19, 2025 |
JEE Advanced 2025 | మే 18, 2025 |