HomeLATESTఇంటర్ మ్యాథ్స్​ సిలబస్​లో తీసేసిన టాపిక్స్​ ఇవే

ఇంటర్ మ్యాథ్స్​ సిలబస్​లో తీసేసిన టాపిక్స్​ ఇవే

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ సిలబస్ ను ప్రభుత్వం చాలా వరకు తగ్గించింది. ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ 1A, 1B, సెకండియర్​ 2A, 2B పేపర్ల నుంచి ఏ టాపిక్స్​ తొలగించారో తెలుసుకుందాం. వీటిని మినహాయించే మిగతా చాప్టర్లపై విద్యార్థులు ఫోకస్​ పెడితే సరిపోతుంది. ఆల్​ ది బెస్ట్.

1A పేపర్​

పేపర్​ 1Aలోని 4, 6 అధ్యాయాల నుంచి అన్ని టాపిక్స్​ సిలబస్​లో ఉన్నాయి. వీటిలో ఏ టాపిక్​ కూడా తొలగించలేదు కావునా పూర్తి స్థాయిలో ప్రిపేర్​ అవ్వాలి. పేపర్​ 1Aలో తొలగించిన అంశాలు చూద్దాం..

తొలగించిన అంశాలు

అధ్యాయం-1: ప్రమేయాలు, 1.2. విలోమ ప్రమేయాలు & వాటికి సంబంధించిన సిద్ధాంతాలు మొదటి అధ్యాయం నుంచి తొలగించిన టాపిక్స్​లో ఉన్నాయి​.

అధ్యాయం -2 గణితానుగమనం తొలగించారు.

అధ్యాయం -3 మాత్రికలు, 3.4.8. నిర్ధారకాల ధర్మాలు మరియు వాటికి సంబంధించిన ఉదాహరణలు, సమస్యలు, 3.6. ఏక కాల రేఖీయ సమీకరణాల సంగతత్వం, అసంగతత్వం, 3.7 గాస్ – జోర్డాన్ పద్ధతి, 3.7.7 తో పాటు తర్వాత అన్ని టాపిక్స్​ తీసేశారు.

అధ్యాయం- 5 సదిశల లబ్దం, 5.11. ఒక తలం యొక్క సదిశా సమీకరణం, వివిధ రూపాలు, అతలీయ రేఖలు, అతలీయ రేఖల మధ్య లంబ దూరం, సరళ రేఖలు సతలీయాలు కావడానికి నియమం, 5.12. సదిశా త్రిక లబ్దం మరియు వాటి ఫలితాలు తొలగించారు.

అధ్యాయం -7 త్రికోణ మితీయ సమీకరణాలు,

అధ్యాయం -8 విలోమ త్రికోణ మితీయ ప్రమేయాలు,

అధ్యాయం -9 అతి పరావలయ ప్రమెయాలు, 9.2 విలోమ అతి పరావలయ ప్రమెయాలు మరియు గ్రాఫ్ లు తొలగించిన టాపిక్స్​ లో ఉన్నాయి.

I-B పేపర్​

పేపర్- IB లో 1,2,3,5 అధ్యాయాలతో పాటు అధ్యాయం 6 లో నుంచి అన్ని అంశాలు సిలబస్​లో ఉన్నాయి. ఇవి ఎగ్జామ్​లో అడిగే అవకాశం ఉంది. వీటి నుంచి ఎలాంటి అంశాలు తొలగించలేదు.

తొలగించిన అంశాలు

అధ్యాయం -4 సరళ రేఖా యుగ్మాలు, 4.3 సరళ రేఖల మధ్య కోణాల సమద్విఖండన రేఖాయుగ్మం, అభ్యాసం 4(a) మరియు సంబంధిత సమస్యలు, 4.5 సమాంతర రేఖలవడానికి నియమాలు, వాటి మధ్య లంబ దూరం, రేఖా యుగ్మ ఖండన బిందువు, అభ్యాసం 4(b), అధ్యాయం -7 నుంచి సమతలం, అభ్యాసం 7(a) సెక్షన్ II & III సంబంధిత సమస్యలు,

అధ్యాయం -8 అవధులు, అవిచ్ఛిన్నత, 8.4 అవిచ్చిన్నత,

అధ్యాయం -9 అవకలనం. 9.3 విలోమ త్రికోణ మితీయ ప్రమేయాలు అవకలనాలు, అభ్యాసం 9(c) సెక్షన్ III సంబంధిత సమస్యలు, అభ్యాసం 9(d),

అధ్యాయం 10 అవకలజాల అనువర్తనాలు, 10.6 మార్పు రేటు గా అవకలనం, 10.7 రోలే సిద్ధాంతం, లెగ్రాంజీ మధ్యమ మూల్య సిద్ధాంతం, 10.8 ఆరోహణ, అవరోహణ ప్రమేయాలు తొలగించిన అంశాల్లో ఉన్నాయి.

సెకండియర్​ మ్యాథ్స్​లో తొలగించిన టాపిక్స్​

2 A పేపర్​

పేపర్-IIA లో 4, 10 అధ్యాయాల నుంచి అన్ని టాపిక్స్​ సిలబస్​లో ఉన్నాయి. ఇందులో అన్ని టాపిక్స్​ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

తొలగించిన అంశాలు

అధ్యాయం-1 సంకీర్ణ సంఖ్యలు, 1.3 సంకీర్ణ సంఖ్యామాపం, ఆయామం, దృష్టాంతాలు, 1.4 సంకీర్ణ సంఖ్యను జ్యామితీయంగా ధ్రువ రూపంలో చిత్రించడం,

అధ్యాయం-2 డి మోయర్ సిద్ధాంతం. అభ్యాసం 2(b), సెక్షన్ II తో పాటు తరవాతి అన్ని టాపిక్స్​,

అధ్యాయం-3 వర్గ సమాసాలు, 3.3 వర్గ అసమీకరణాలు,

అధ్యాయం-5 ప్రస్తారాలు- సంయోగాలు, 5.3 పునరావృతాన్ని అనుమతించిన ప్పుడు ప్రస్తారాలు, 5.4 వృత్తాకార ప్రస్తారాలు, 5.5 నియమబద్ధ పునరావృతాలున్న ప్రస్తారాలు, అభ్యాసం 5(e) టాపిక్స్​ తొలగించారు.

సెక్షన్ IIIలో
అధ్యాయం-6 ద్విపద సిద్ధాంతం, అభ్యాసం 6(a), సెక్షన్ II, 5 వ సమస్య మరియు తర్వాత అన్ని సమస్యలు, సంబంధిత ఉదాహరణలు, అభ్యాసం 6(b), సెక్షన్ II, మరియు తర్వాత అన్ని సమస్యలు, సంబంధిత ఉదాహరణలు, అభ్యాసం 6(c),

అధ్యాయం-7 పాక్షిక భిన్నాలు, అభ్యాసం 7(d),

అధ్యాయం-8 విస్తరణ కొలతలు, 8.2.2 వర్గీకృత దత్తాంశానికి మధ్యమ విచలనం, అభ్యాసం 8(a), సెక్షన్ I, 3 వ సమస్య మరియు తర్వాత అన్ని సమస్యలు, సంబంధిత ఉదాహరణలు తొలగించిన అంశాల్లో ఉన్నాయి.

2-B పేపర్

పేపర్-IIB లో 1,2, 7 అధ్యాయాలతో పాటు అధ్యాయం 8 నుంచి మొత్తం టాపిక్స్​ సిలబస్​లో ఇచ్చారు. ఇందులో అన్ని టాపిక్స్​ ఎగ్జామ్​లో అడుగుతారు.

తొలగించిన అంశాలు

అధ్యాయం 3 పరావలయం, 3.2 పరావలయం పై ఒక బిందువు వద్ద స్పర్శ రేఖ, అభిలంబ రేఖ ల సమీకరణాలు,

అధ్యాయం -4 దీర్ఘ వృత్తం, 4.2 దీర్ఘ వృత్తం పై ఒక బిందువు వద్ద స్పర్శ రేఖ, అభిలంబ రేఖ ల సమీకరణాలు.

అధ్యాయం -5 అతిపరావలయం, 5.2 అతిపరావలయం పై ఒక బిందువు వద్ద స్పర్శ రేఖ, అభిలంబ రేఖ ల సమీకరణాలు. అభ్యాసం 5(a), సెక్షన్ II, మరియు తర్వాత అన్ని సమస్యలు, సంబంధిత ఉదాహరణలు,

అధ్యాయం-6 సమాకలనం, 6.2(బి) విభాగ సమాకలనం, ఘాతిక, సంవర్గమాన, విలోమ త్రికోణమితీయ ప్రమేయాల సమాకలనం,

అధ్యాయం -9 సంభావ్యత, 9.3.9 బేయీ సిద్ధాంతం మరియు సంబంధిత సమస్యలు తొలగించిన టాపిక్స్​లో ఉన్నాయి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!