హైదరాబాద్లో వివిధ ప్రైవేట్ సంస్థల సహకారంతో నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్(ఎన్ సీఎస్‌సీ) మార్చి 10న జాబ్‌మేళా నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని విద్యానగర్ శివం రోడ్‌లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ క్యాంపస్‌లో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు ఎన్ సీఎస్‌సీ తెలిపింది.
20 కంపెనీలు.. 1500 జాబ్స్
ఈ కార్యక్రమంలో ఐటీ కంపెనీలతో పాటు అపోలో మెడ్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్, వాల్‌మార్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన దాదాపు 20 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. దాదాపు 1,500లకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి. వివరాలకు 040–27408555, 7905988309 ఫోన్ నంబర్లలో, k.bhookya@gov.inలో సబ్–రీజినల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ శ్రీ భూక్య కాసిమ్‌ను సంప్రదించాలి.