దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడనున్నాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూ వర్సిటీ పరీక్షలతో పాటు ఇగ్నో తదితర పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ జాబితాలోకి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కూడా చేరింది. వర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇగ్నో తాజాగా ప్రకటించింది. 2021 డిసెంబర్‌కు సంబంధించిన ఈ టర్మ్ ఎండ్ పరీక్షలు తదుపరి నోటీసు ఇచ్చేంతవరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం వాయిదా పడిన ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షలు 2022 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 23 వరకు జరగాల్సి ఉంది. తాజాగా పరీక్షలు వాయిదా పడినే నేపథ్యంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ http://ignou.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
జేఎన్‌టీయూ, ఓయూ పరీక్షలు వాయిదా
తెలంగాణలో జనవరి 8 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో జేఎన్‌టీయూ, ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఎన్‌టీయూ పరిధిలో జనవరి 10 – 12 మధ్య జరగాల్సిన బీటెక్, బీ ఫార్మసీ పరీక్షలు జనవరి 19 -21 మధ్య జరుగుతాయని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీటెక్, బీ ఫార్మసీ 3, 4 సంవత్సరాల సప్లిమెంటరీ పరీక్షల రిజిస్ట్రేషన్ తేదీలను మార్చినట్లు వివరించారు.
కరోనా ఎఫెక్ట్ ….. పరీక్షలు వాయిదా
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS