అభ్యర్థుల భారీ ఆందోళనతో టీఎస్పీఎస్సీ దిగి వచ్చింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 (TSPSC GROUP 2 EXAM) పరీక్ష వాయిదా వేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. గురువారం ఉదయం గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని TSPSC ఆఫీసును ముట్టడించిన వేలాది మంది అభ్యర్థులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవటంతో అధికారులు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమను కలిసిన ప్రతినిధి బృందాన్ని తిప్పిపంపించారు.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 (TSPSC GROUP 2 EXAM) పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు హైదరాబాద్‌లో గురువారం ఉదయయమే భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించారు. పోలీసులు అడ్డుపడ్డప్పటికీ వేలాదిగా అభ్యర్థులు తరలిరావటంతో గ్రూప్ 2 పరీక్ష వ్యవహారం రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షించింది. వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించారు. పోలీసులు అడ్డుపడ్డప్పటికీ వేలాదిగా అభ్యర్థులు తరలిరావటంతో గ్రూప్ 2 పరీక్ష వ్యవహారం రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షించింది. ఒకేసారి వేలాదిగా అభ్యర్థులు TSPSC ఆఫీసు వద్దకు చేరుకోవటం, పక్కనే ఉన్న ఖాళీ స్థలం లో బైఠాయించటంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్ 2 వాయిదా వేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అభ్యర్థులు మొండిపట్టు పట్టారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రావాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేశారు. అభ్యర్థులు పెద్ద పెట్టున నినాదాలు చేయటంతో టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఏరియా మొత్తం దద్దరిల్లింది.

గురుకుల్, గ్రూప్ 2, JL, A.O, పాలిటెక్నిక్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ పరీక్షలకు మధ్య తగినంత వ్యవధి లేకపోవటంతో అభ్యర్థులు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షలన్నింటికీ వేర్వేరు సిలబస్ ఉండటం, గ్రూప్ 2 సిలబస్‌లోనూ కొత్త అంశాలను చేర్చటంతో ప్రిపరేషన్‌కు తగినంత వ్యవధి ఇవ్వాలనేది అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అందుకే గ్రూప్ 2 పరీక్షలను మరో రెండు మూడు నెలలు వాయిదా వేయాలని ఇప్పటికే వరుసగా మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 2 కొత్త సిలబస్‌కు అవసరమైన బుక్స్ కూడా మార్కెట్లో ఇప్పటికీ అందుబాటులో లేవని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పేపర్ల లీకేజీ ల తో మానసికంగా కుంగిపోయామని.. ఇప్పుడైనా తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలుమార్లు టీఎస్పీఎస్సీ అధికారులకు మొమోరాండం అందించారు.

టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ అభ్యర్థులతో పాటు టీఎస్పీఎస్సీ ఆఫీసు ఎదుట ఆందోళనలో పాలుపంచుకున్నారు. అభ్యర్థుల ఆందోళనకు దిగి వచ్చిన అధికారులు ఐదుగురు అభ్యర్థులను TSPSC లోపలికి అనుమతించారు. పోలీసుల సూచన మేరకు అభ్యర్థుల తరఫున వెళ్లిన ప్రతినిధులు గ్రూప్ 2 వాయిదా వేయాలని, తమ డిమాండ్లను తెలియజేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ భారీ ఆందోళనతో టీఎస్పీఎస్సీ దిగివచ్చిన సంకేతాలు వెలువడ్డాయి. రెండు రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా.. అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

TSPSC కార్యదర్శి అనిత రామచంద్రన్
“వినతిపత్రం తీసుకున్నాం. పరిశీలిస్తాం రెండు రోజుల సమయం పడుతది. తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేయకండి. గ్రూప్ 2 పరీక్ష ప్రస్తుతానికి వాయిదా ఎం లేదు”