నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 100 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో 12 ప్రొఫెసర్ పోస్టులు, 52 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 36 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 25వ తేదీలో లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి. రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్లను అఫిషియల్ వెబ్సైట్లో nitw.ac.in ఈనెల 27వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని ఎన్ఐటీ ప్రకటన జారీ చేసింది.
