మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు (సీడీపీవో-23 పోస్టులు), విస్తరణ అధికారులు (ఈవో-181 పోస్టులు) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ రీ షెడ్యూల్ ప్రకటించింది. 2023లో నిర్వహించిన రాతపరీక్షలను ఇటీవల కమిషన్ రద్దు చేసి, సీడీపీవో పోస్టుల ఎంపిక జాబితాను వెనక్కు తీసుకుంది. రీ షెడ్యూల్ ప్రకారం సీడీపీవో పోస్టులకు 2025 జనవరి 3, 4 తేదీల్లో, ఈవో పోస్టులకు జనవరి 6, 7 తేదీల్లో సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్‌నికోలస్ తెలిపారు. పరీక్షలకు వారం రోజుల ముందు వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. నార్మలైజేషన్ విధానంలో మార్కులు లెక్కించనున్నారు.
సీడీపీవో, ఈవో పోస్టులకు పరీక్ష షెడ్యూలు రిలీజ్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS