హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024–-25 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులో అడ్మిషన్స్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని అధ్యయన కేంద్రాల్లో అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చు. ఈ విద్యాసంవత్సరం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశాలు చేపట్టనుంది.
కోర్సులు:
డిగ్రీ ప్రోగ్రామ్: బీఏ, బీకాం, బీఎస్సీ
పీజీ ప్రోగ్రామ్:
- ఎంఏ: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్/ ఎకనామిక్స్/ హిస్టరీ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ పొలిటికల్ సైన్స్/ సోషియాలజీ/ ఇంగ్లిష్/ తెలుగు/ హిందీ/ ఉర్దూ.
- ఎంఎస్సీ: మ్యాథ్స్/ అప్లైడ్ మ్యాథ్స్/ సైకాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫిజిక్స్/ జువాలజీ.
- ఎంకాం
- ఎంఎల్‌ఐఎస్సీ
- బీఎల్‌ఐఎస్సీ
డిప్లొమా ప్రోగ్రామ్: సైకలాజికల్ కౌన్సెలింగ్/ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ ఆపరేషనల్ మేనేజ్‌మెంట్/ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్/ హ్యూమన్ రైట్స్/ కల్చర్ & హెరిటేజ్ టూరిజం/ ఉమెన్స్ స్టడీస్/ ఇంటర్నేషనల్ రిలేషన్స్.
సర్టిఫికెట్ ప్రోగ్రామ్: ఫుడ్ అండ్ న్యూట్రిషన్/ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్/ ఎన్‌జీవోస్ మేనేజ్‌మెంట్/ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.
ప్రోగ్రామ్ డ్యురేషన్: యూజీ ప్రోగ్రామ్‌నకు మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌కు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమా ప్రోగ్రామ్‌నకు ఏడాది, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌కు ఆరు నెలలు ఉంటుంది.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్సైట్లో సంప్రదించాలి.