Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSకరెంట్​ అఫైర్స్​ ప్రాక్టీస్​ టెస్ట్ 2

కరెంట్​ అఫైర్స్​ ప్రాక్టీస్​ టెస్ట్ 2

current affairs test for all TSPSC Exams. టీఎస్​పీఎస్​సీ నిర్వహిస్తున్న అన్ని ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్​ బిట్​ బ్యాంక్​ టెస్ట్.. ప్రాక్టీస్​ చేయండి. విజయం సాధించండి.
(జవాబు కోసం ప్రశ్న పక్కన ఉన్న డౌన్​ యారో క్లిక్​ చేయండి)
1. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్‌ యువకుడు

జ: కె.శివతేజ (డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఇతడు రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 25కి పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశాడు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందాడు.)

2. అమెరికాలోని కన్సాన్‌ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన భారతీయ-అమెరికన్‌ ఎవరు

జ: ఉషారెడ్డి

3. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌. ఇందులోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో టీమ్‌ లీడర్‌గా ఎంపికైన తొలి మహిళ

జ: కెప్టెన్‌ శివ చౌహాన్‌

4. బ్యాటరీలు, విద్యుత్‌ పరికరాల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిథియం నిక్షేపాలను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) మనదేశంలో తొలిసారిగా ఎక్కడ గుర్తించింది.

జ: జమ్మూ-కశ్మీర్‌లోని రియాసి జిల్లా సలాల్‌ హైమనా ప్రాంతంలో ఈ నిల్వలను కనుక్కుంది.

5. బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ ఇటీవల రచించిన పుస్తకం ఏది?

జ: స్పేర్‌

6. జీ-20 ప్రపంచ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది. ఈసారి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది.

జ: ఢిల్లీలో 2023 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతుంది. ఈసారి భారత్​ అధ్యక్షత వహించనుంది.

7. వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌ – 2023 సదస్సును ఇటీవల భారత్‌ వర్చువల్‌గా నిర్వహించింది. ఏ థీమ్ తో ఈ సదస్సు జరిగింది.

జ: ‘యూనిటీ ఆఫ్‌ వాయిస్, యూనిటీ ఆఫ్‌ పర్పస్‌’ థీమ్‌తో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

8. గ్లోబల్‌ సౌత్‌గా ఏ దేశాలను వ్యవహరిస్తారు

జ: ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా

9. కేంద్ర హోం శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా పోలీసు బలగాల్లో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు?

జ: 11.75 శాతం

10. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, 2023, జనవరి 1 నాటికి మనదేశంలో రిజిస్టర్‌ ఓటర్ల సంఖ్య

జ: 94.5 కోట్లు (దేశంలో 1951లో మొదటిసారి ఓటర్ల జాబితా రూపొందించారు. అప్పుడు 17.32 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు.)

11. ఆధునిక యుద్ధ నౌకల ప్రపంచ డైరెక్టరీ – 2022’ వెల్లడించిన గణాంకాల ప్రకారం నౌకా బలంలో భారత్‌ది ప్రపంచంలో ఎన్నో స్థానం

జ: ఏడు (తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి)

12. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, దక్షిణాసియాలో బలహీన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏది?

జ: పాకిస్థాన్‌ (గతేడాది సంభవించిన వరదలే ఈ పరిస్థితికి కారణమని నివేదిక విశ్లేషించింది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఆ దేశానికి ఇప్పటికిప్పుడు 3300 కోట్ల డాలర్లు రుణంగా కావాలని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.)

13. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ (డబ్ల్యూపీఆర్‌) నివేదిక ప్రకారం, 2023 జనవరి 18 నాటికి భారతదేశ జనాభా ఎంత?

జ: 142.3 కోట్లు (భారత్‌ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతరించిందని ఇది పేర్కొంది. 2022, డిసెంబరు 31 నాటికి తమ జనాభా 141.18 కోట్లని చైనా అధికారికంగా ప్రకటించింది. అదే రోజున భారతదేశ జనాభా 141.7 కోట్లకు చేరినట్లు డబ్ల్యూపీఆర్‌ అంచనా వేసింది.)

14. కింది అంశాల్లో సరైంది?

ఎ) భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో కీలకమైన పాత్ర పోషించే ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన సైంటిఫిక్‌ అసెస్‌మెంట్‌ ప్యానెల్‌ తన నివేదికలో వెల్లడించింది.

బి) ఓజోన్‌ పొర పూడుకుపోవడం 2022లో మొదలైంది. ఈ రంధ్రం 2022, సెప్టెంబరు 7 నుంచి అక్టోబరు 13 మధ్య సగటున 23.2 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయినట్లు నివేదిక తెలుపుతుంది.

సి) క్లోరోఫ్లోరో కర్బన ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఓజోన్‌ రంధ్రం పూడుకుంటున్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇదే విధంగా ఉద్గారాలు తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా ఓజోన్‌ రంధ్రం పూడుకుంటుందని అంచనా వేశారు.

డి) ఓజోన్‌ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. రాబోయే నాలుగు దశాబ్దాల్లో ఈ పొర పూర్వ స్థితికి చేరుకుంటుందని నిపుణుల అంచనా.

జ: పైవన్నీ

15. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022’ పురస్కారానికి ఎవరిని ఎంపిక చేసింది.

జ: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌

16. ఐసీసీ 2022 వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌

జ: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌

17. ఐసీసీ 2022 ‘టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’

జ: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌

18. ఐసీసీ 2022 ‘టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’

జ: భారత క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌

19. ఐసీసీ ఉమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుతో పాటు ‘ఉమెన్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికైంది

జ: ఇంగ్లండ్‌కు చెందిన మహిళా క్రికెటర్‌ నాట్‌ సివర్‌

20. ఐసీసీ మహిళల ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందుకున్నది

జ: భారత మహిళల జట్టు పేసర్‌ రేణుక సింగ్‌

21. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు.

జ: జనవరి 25

22. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 126వ జయంతి సందర్భంగా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోని 21 దీవులకు పరమవీరచక్ర పురస్కార గ్రహీతల పేర్లు పెట్టారు?

జ: అండమాన్‌ నికోబార్‌ (2023, జనవరి 23న బోస్‌ 126వ జయంతిని నిర్వహించారు. నేతాజీ స్మారకాన్ని ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని రాస్‌ ఐలాండ్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.)

23. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

జ: జనవరి 25 (కేంద్ర ఎన్నికల సంఘం 2011 నుంచి ఏటా ఈ రోజున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇటీవలి 13వ ఓటర్ల దినోత్సవాన్ని ‘నథింగ్‌ లైక్‌ ఓటింగ్, ఐ ఓట్‌ ఫర్‌ ష్యూర్‌’ అనే థీమ్‌తో నిర్వహించారు.)

24. మన దేశంలో ఏ నెలను గర్భాశయ క్యాన్సర్‌ అవగాహన మాసంగా నిర్వహిస్తారు

జ: జనవరి

25. ‘మద్యం ఒక్క చుక్క తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే’ అని ఇటీవల ఏ సంస్థ అందుకు సంబంధించిన వివరాలను ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించింది?

జ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!