తెలంగాణలో జరుగుతున్న వివిధ ఉద్యోగ నియామకాల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రధాన ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క తప్పుపట్టారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించిన అంశంపై ప్రశ్నించారు. మెయిన్స్ ను 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం సరికాదన్నారు. గతంలో మాదిరిగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోమ్ గార్డ్ లను పర్మినెంట్ చేయాలన్నారు.
గ్రూప్-1, పోలీస్ నియామకాలపై అసెంబ్లీలో డిమాండ్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS