HomeLATESTకామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్ 2023

కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్ 2023

దేశం లోని సెంట్రల్ యూనివర్సిటీలు,ఇతర విద్యా సంస్థల్లో డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-2023 షెడ్యూల్ విడుదలైంది. యూజీసీ ఛైర్మన్ మామిడాల్ జగదీశ్ కుమార్ ట్విట్టర్లో ఈ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 44 సెంట్రల్ యూనివర్సిటీల్లో దీని ద్వారా యూజీ కోర్సుల్లో చేరొచ్చు. అర్హులైన విద్యార్థులు ఆన్​ లైన్​లో మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు మే 21 నుంచి ప్రారంభమవుతాయి.

Advertisement

అర్హత: ఇంటర్ అర్హత కలిగి ఉండాలి. ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ తెలుగుతో పాటు13 భాషల్లో రాయొచ్చు.

ఎగ్జామ్ ప్యాటర్న్: యూజీ ఎగ్జామ్ మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్‌(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్‌ స్పెసిఫిక్‌ సబ్జెక్టులో, మూడో సెక్షన్‌ జనరల్‌ టెస్ట్‌లో మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు కేటాయించారు. తప్పు జవాబుకు ఒక మార్కు కట్​ చేస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లో 45/50 ప్రశ్నలకు 35/40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలుంటాయి. 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

సెలెక్షన్: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. పూర్తి వివరాలు  www.cuet.samarth.ac.in వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!