దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీ (5 Yeasr LLB) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2024 (CLAT) ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీన నిర్వహిస్తారు. బుధవారం సమావేశమైన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం ఈ పరీక్ష తేదీని ఖరారు చేసింది.
వచ్చే ఏడాది (2024) అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను డిసెంబర్ 3వ తేదీన నిర్వహిస్తారు. CLAT 2024కు సంబంధించిన అప్లికేషన్, సిలబస్, కౌన్సిలింగ్ ప్రక్రియ వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు కన్సార్టియం ఒక ప్రకటన విడుదల చేసింది.
