సివిల్ సర్వీస్ అభ్యర్థులకు యూపీఎస్సీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి రెండో తేదీన 861 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌కు మరో 150 పోస్టులను పెంచుతూ అనుబంధ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పోస్టుల సంఖ్య 1,011 కు చేరింది. ఆరేండ్ల తర్వాత తొలిసారి వెయ్యికి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్‌ఎంఎస్)లో ఈ 150 ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. పూర్తి వివరాలకు యూపీఎస్సీ వెబ్‌సైట్ చూడవచ్చు.
వెబ్‌సైట్: www.upsc.gov.in
