HomeLATESTఇండియన్‌ బ్యాంక్‌లో 202 సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు

ఇండియన్‌ బ్యాంక్‌లో 202 సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్‌ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. మొత్తం 202 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 9వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ (ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ ఫోర్స్‌) అయి ఉండాలి. వయసు 26 ఏళ్లు మించకుండా ఉండాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌ (ఆన్‌లైన్)లో ఉంటుంది. టెస్ట్‌ ఆఫ్‌ లోకల్‌ లాంగ్వేజ్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్షని మొత్తం 40 మార్కులకి నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. ఫిబ్రవరి 23 నుంచి ఆన్​లైన్​ అప్లికేషన్​ ప్రాసెస్​ మొదలవుతుంది. మార్చి 9 లోపు అప్లై చేసుకోవాలి.

వెబ్​సైట్​: www.indianbank.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!