బ్యాంకులో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బిజినెస్ కరస్పాండెంట్, సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు కూడా షురూ అయ్యింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ వెబ్ సైట్ centralbankofindia.co.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 10 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నవాళ్లు ముందుగా ఈ విషయాలను పూర్తి అర్థం చేసుకోండి
అర్హతలు:
సెంట్రల్ బ్యాంక్ ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన సంబంధిత అర్హతలు ఉండాలి. అప్పుడే వారు అప్లయ్ చేసుకునేందుకు అర్హులు.
వేతనం:
స్థిరభాగం, రూ. 15000, వేరియబుల్ కాంపోనెంట్ రూ. 10000
వయస్సు:
సెంట్రల్ బ్యాంక్ ఈ రిక్రూట్ మెంట్ కోసం అప్లయ్ చేసుకునే అభ్యర్థులందరి వయస్సు 65ఏండ్లు మించకూడదని నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలని భావించే అభ్యర్థులు ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు :
రిక్రూట్ మెంట్ కోసం అప్లయ్ చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫారమ్ ప్రింట్ ను అవసరమైన పత్రాలతో పాటు ఈ చిరునామాకు పంపించాలి.
చిరునామా:
పోస్టింగ్ స్థానం: రీజినల్ హెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్వారిఘాట్ రోడ్, పోలిపత్తర్, సౌత్ అవెన్యూ మాల్, జబల్‌పూర్, పిన్-482008 (మధ్యప్రదేశ్)