HomeLATESTజూన్ 1 నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు.. బయోమెట్రిక్​ తప్పనిసరి

జూన్ 1 నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు.. బయోమెట్రిక్​ తప్పనిసరి

తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TGPSC) కీలక ప్రకటన చేసింది. జూన్ 9వ తేదీన జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను జూన్ 1వ తేదీ నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం శాంపిల్ ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

  • టీజీపీఎస్​సీ తాజా నిబంధనల ప్రకారం.. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే.. ఉదయం 10 గంటల తరువాత గేట్లు మూసివేస్తారు.
  • జూన్‌ 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • పరీక్ష రాసే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్‌ తప్పనిసరి. బయోమెట్రిక్​ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని కమిషన్​ స్పష్టం చేసింది.
  • అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంట కోసారి బెల్‌మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని, అవసరమైతే అభ్యర్థులు ఇన్విజిలేటర్‌ను అడిగి సమయం తెలుసుకోవచ్చు.
  • అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్‌ షీట్లు ఇస్తారు. అభ్యర్థులు ఓంఎఆర్, ప్రశ్నపత్రంలో ముద్రించిన నిబంధనలు సూచనలు పాటించాలి.
  • అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ఓఎంఆర్‌ను కమిషన్‌ వెబ్‌సైట్లో ఇప్పటికే ఉంచారు. ఈ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోని సూచనల ప్రకారం సరైన విధానంలో వివరాలు రాయడంతో పాటు బబ్లింగ్‌ చేయడాన్ని ప్రాక్టీస్‌ చేసుకోవాలి.
  • అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష ముగిసేవరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు. పరీక్ష ముగిశాక ఓఎంఆర్‌ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అప్పగించాలి.
  • హాల్‌టికెట్‌పై ముద్రించిన సూచనల కాపీని వెబ్‌సైట్లో పొందుపరిచారు. సూచనలు జాగ్రత్తగా చదివి, వాటిని పరీక్ష సమయంలో పాటించాలి. అభ్యర్థులు చేసే పొరపాట్లకు, ఓఎంఆర్, హాల్‌టికెట్లలోని నిబంధనలు పాటించకుంటే కమిషన్‌ ఎలాంటి బాధ్యతా వహించదు.
  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్పులు మాత్రమే వాడాలి. బూట్లు ధరించకూడదు.
     
  • అభ్యర్థులకు బయోమెట్రిక్‌ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు. 
  • తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేరును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.


RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here