ఏపీ ఇంటర్ ఫలితాలపై అధికారిక ప్రకటన రానే వచ్చేసింది. ఈ నెల 26వ తేదీ.. అంటే రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ శేషగిరి బాబు ప్రకటన విడుదల చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు https://bieap.apcfss.in/ వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు నిర్వహించింది. ఈ పరీక్షలకు 9.20 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కాగా.. ఒకేషనల్ విద్యార్థులు మరో 83,749 మంది ఉన్నారు.