Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSడిగ్రీతో న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జాబ్స్​

డిగ్రీతో న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జాబ్స్​

న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఐఏసీఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 170 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో సెప్టెంబర్​ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు: జనరలిస్ట్స్​ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అకౌంట్స్‌- పోస్టులకు చార్డర్డ్‌ అకౌంటెంట్‌ (ఐసీఏఐ)/ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ లేదా ఎంబీఏ ఫైనాన్స్‌/ పీజీడీఎం ఫైనాన్స్‌/ ఎంకాం కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎగ్జామ్​ ప్యాటర్న్

ప్రిలిమ్స్​: ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/ హిందీ భాషల్లో 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 60 నిమిషాలు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు 30 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీకి 35 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 35 మార్కులకు ఉంటుంది.
మెయిన్స్​: ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ 200 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ 30 మార్కులకు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ పూర్తయిన వెంటనే ఆన్‌లైన్‌లోనే డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ రాయాలి.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. ప్రిలిమ్స్​ పరీక్ష అక్టోబర్​ 13న , మెయిన్స్​ నవంబర్ 17న నిర్వహించనున్నారు. వివరాలకు www.newindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!