Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్

1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్​ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 10న జరిగే రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపడుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రాత పరీక్షను రెండు లేదా మూడు సెషన్లలో నిర్వహిస్తారు. పేపర్ ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది.

ఈ పోస్టుల్లో 95 శాతం స్థానికులకే కేటాయించారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. ఒకటి నుంచి ఏడు వరకు ఇక్కడ చదవకుంటే, తెలంగాణ స్థానికతపై ప్రభుత్వం జారీ చేసే ధృవపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవ త్సరాలకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు వయోపరిమితి ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు సడలింపు ఇచ్చారు.

ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ద తిలో పనిజేస్తున్న వారికి వెయిటేజ్ మార్కులుంటాయి. మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజ్ కింద కలుపు తారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్దతిలో పనిజేస్తున్న వారికి వెయిటెజ్ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్యసేవ లందిస్తే 2.5 పాయింట్స్ కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్స్ ఇస్తారు. కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజ్ మార్కులొస్తాయి. పోస్టుల వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్త గూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట పట్టణాలను పరీక్షా కేంద్రాల కింద ఎంపిక చేశారు. అఫిషియల్​ వెబ్ సైట్ www. mhsrb.telangana.gov.in లోనూ పూర్తి వివరాలున్నాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!