HomeLATESTటెట్​కు ఏ పుస్తకాలు చదివితే.. 130 స్కోర్​ చేయొచ్చు

టెట్​కు ఏ పుస్తకాలు చదివితే.. 130 స్కోర్​ చేయొచ్చు

టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్ TSTET 2022​ నోటిఫికేషన్​ వచ్చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ప్రిపరేషన్​ ప్రారంభించడమే తరువాయి. జూన్​ 12న ఎగ్జామ్​ జరుగనుంది. ప్రిపరేషన్​ కోసం అభ్యర్థులకు రెండు నెలల టైమ్​ ఉంది. ఈ టైమ్​లో అభ్యర్థులు చదవాల్సిన పాఠ్యపుస్తకాలు, మార్కెట్​లో ఉన్న స్టాండర్డ్​ బుక్స్​ వివరాలు మీకోసం..

పేపర్​ –1 రాసే వారు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, పేపర్​–2 రాసేవారు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలను తెచ్చుకోవాలి.
(అన్ని పుస్తకాల పీడీఎఫ్​లు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. ఫ్రీగా డౌన్​లోడ్ చేసుకొండి​ )

https://merupulu.com/text-books/

పాఠ్యపుస్తకాలతో పాటు డీఈడీ, బీఈడీ కోర్సులో చదివిన వివిధ సబ్జెక్టుల తెలుగు అకాడమీ పుస్తకాలు తప్పనిసరిగా ఉండాలి.

తెలుగు గ్రామర్​ కోసం సీనియర్​ సబ్జెక్ట్​ నిపుణులు ద్వానా శాస్త్రీ, ఆకెళ్ల రాఘవేంద్ర రాసిన పుస్తకాల్లో చాలా రకాల ఉదాహరణలతో వ్యాకరణాంశాలను వివరించారు. వాటిని సేకరించుకోవాలి. వీటితో పాటు తెలుగు పాఠ్యపుస్తకాల్లో వ్యాకరణాంశాలు, కవి పరిచయాలు, సొంత నోట్స్​ ప్రిపేర్​ చేసుకోవాలి.

  • ఇంగ్లీష్​ కంటెట్​, గ్రామర్​, మెథడాలజీ సంబంధించి హరిహంత్​ పబ్లికేషన్​ బుక్స్​ బాగున్నాయి. వీటిని సంబంధించి న్యూ ఎడిషన్​ పుస్తకాలను తీసుకోవాలి.
  • సైకాలజీ కోసం తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు ఎస్​ అండ్​ ఎస్​ పబ్లికేషన్​ వారు ప్రచురించి పుసక్తం బాగుంది.
  • మెథడాలజీ కోసం డీఈడీ, బీఈడీ తెలుగు అకాడమీ పుస్తకాలు చదవడం ఉత్తమం. వాటిల్లోనుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. సైన్స్​, మ్యాథ్స్​, సోషల్​ మెథడాలజీ 70శాతం వరకు దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ట్రై మెథడ్స్​ సంబంధించి ఒకే బుక్​ అందుబాటులో ఉంది.
  • టెట్​ పేపర్​–1, పేపర్​–2 ఆల్​ ఇన్​వన్​ పుస్తకాలు కూడా మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్కువగా రామయ్య పబ్లికేషన్​ సంబంధించి పుస్తకాలు స్టాండర్డ్‌గా​ ఉన్నాయి. వీటితో పాటు విజేత కాంపిటిషన్స్​ ఆల్​ ఇన్​ వన్ కూడా అందుబాటులో ఉంది.
  • పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటుగా మార్కెట్​తో చాలా కాలంగా టెట్​, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రిస్తున్న అనూ పబ్లికేషన్స్​, ఎస్​ అండ్​ ఎస్​, అవనిగడ్డ ప్రగతి కోచింగ్​ సెంటర్​ మెటీరియల్​, విజేత కాంపిటేషన్స్​ పుస్తకాలు, ప్రాక్టీస్​ కోసం మోడల్​ పేపర్స్​ బుక్స్​ను సేకరించుకుంటే మంచి స్కోర్​ సాధించవచ్చు.
merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!