ఇంటర్మీడియేట్, డిగ్రీలో 40 శాతం మార్కులున్నా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) రాసేందుకు అర్హులేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నోటిఫికేషన్లోనూ పేర్కొన్నది. అయితే టెట్ రాసేందుకు జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని లేదంటే టెట్‌కు అనర్హులని ప్రచారం జరిగింది. కానీ ఈ విషయం పై టెట్ కన్వీనర్ స్పష్టత నిచ్చారు. 2015 కంటే ముందు డీఈడీ, బీఈడీ చేసిన వారికి ఇంటర్, డిగ్రీలో 40 శాతం మార్కులున్నా.. సరిపోతుందని, 2015 తర్వాత పాసైన వారికి మాత్రం తప్పనిసరిగా 45 శాతం మార్కులుండాలని తెలిపారు. తెలంగాణాలో 2018 డీఎస్సీ నిర్వహించిన సమయంలోనూ ఈ వివాదం తలెత్తింది. ఇంటర్, డిగ్రీలో45శాతం మార్కుల కంటే తక్కువ వారిని టీఆర్టీ రాసేందుకు అనుమతించలేదు. ఈ విషయంపై పలువురు అభ్యర్థులు తాము అర్హులమేనంటూ కోర్టు మెట్లెక్కారు. కోర్టు అనుమతితో కొందరు మాత్రమే టీఆర్టీ రాసి ఉద్యోగాలు సాధించారు. ఇదే విషయంపై ఇప్పుడు చాలా మంది అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో 40 శాతం మార్కులున్నా టెట్‌కు అనుమతి లభించడంతో రేపు తెలంగాణాలో నిర్వహించే ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ అవకాశం ఉంటుందని అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
40 శాతం మార్కులున్నా టెట్‌కు అర్హులే.
RELATED ARTICLES
LATEST
PRACTICE TEST
CURRENT AFFAIRS