తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ వచ్చే విద్యాసంవత్సరం 2022–23లో 5వ తరగతితో పాటు 6 నుంచి 10వ తరగతిలో మిగిలిన సీట్లు, ఇంటర్మీడియేట్ సీట్ల భర్తీకి మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ‘టీఎంఆర్ఈఐఎస్’ అఏ యాప్‌ను డౌన్ చేసుకోవాలని తెలిపింది. ఏప్రిల్ 11 వరకు ఈ యాప్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతిలో చేరే విద్యార్థులకు మే 9న, 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు అప్లై చేసుకున్న వారికి మే 10, ఇంటర్మీడియేట్ ప్రవేశాల కోసం మే 21న అడ్మిషన్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మే 26 నుంచి జూన్ 6వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం తరగతులు ప్రారంభమవుతాయి. యాప్‌తో పాటు మైనార్టీ గురుకుల అధికారిక వెబ్సైట్ www.tmreis.telangana.gov.in లో కూడా అప్లై చేసుకోవచ్చని మైనార్టీ సొసైటీ కార్యదర్శి బి.షఫీఉల్లా తెలిపారు.
మొబైల్ యాప్‌తో గురుకుల అడ్మిషన్లు
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS