HomeLATESTరెసిడెన్సియల్​ కాలేజీలుగా ‘బీసీ గురుకులాలు’

రెసిడెన్సియల్​ కాలేజీలుగా ‘బీసీ గురుకులాలు’

రాష్ట్రంలో ఉన్న 138 బీసీ గురుకులాలను కాలేజీలుగా అప్​గ్రేడ్​ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది. 2017–18 విద్యాసంవత్సరంలో 5, 6. 7 తరగతులను ప్రారంభించగా.. ప్రతి ఏడాది ఒక్కో తరగతిని పెంచుకుంటూ వస్తుండగా ఈ విద్యాసంవత్సరం నాటికి పదోతరగతి స్థాయి వరకు వచ్చింది. కాగా వచ్చే ఏడాది 2022–23 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియేట్​ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 138 బీసీ గురుకులాలు ఉండగా వీటిలో 68 బాలురు, 70 బాలికల గురుకులాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 21, 680 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజాగా ఇంటర్మీడియేట్​వరకు అప్​గ్రేడ్​ కావడంతో వీరందరికీ లబ్ది చేకూరనుంది.

Advertisement

కొత్త కోర్సులూ అందుబాటులో..

బీసీ గురుకులాల్లో పలు కొత్త ఒకేషనల్​ కోర్సులూ ప్రవేశపెడుతున్నట్టు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అగ్రికల్చర్​ అండ్​ క్రాప్ ప్రొడక్షన్​, అకౌంటింగ్​, ట్యాక్సేషన్​, ఆఫీస్​ అసిస్టెంట్​షిప్​, కంప్యూటర్​ గ్రాఫిక్స్​ అండ్​ యానిమేషన్​, హోమ్​ సైన్స్​, కమర్షియల్​ గార్మెంట్​ టెక్నాలజీ, మల్టీపర్పస్​ హెల్త్​ అసిస్టెంట్​, మెడికల్​ ల్యాబ్​ టెక్నీషియన్​, ఫిజియోథెరఫీ, టూరిజం అండ్​ హాస్పిటాలజీ మేనేజ్​మెంట్​ కోర్సులను ప్రవేశపెడుతున్నామని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!