తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ‘టీఎస్ఏసీఎస్’లో కాంట్రాక్ట్ బేసిస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 34 ఖాళీలున్నాయి. షార్ట్ లిస్టింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు
ఐసీటీసీ కౌన్సిలర్ పోస్టులు 16 ఉన్నాయి. వీటికి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉత్తీర్ణత, పని అనుభవం తప్పనిసరి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. జీతం నెలకు రూ. 13వేలు చెల్లిస్తారు.
డీఎస్ఆర్సీ కౌన్సెలర్ పోస్టులు మొత్తం 10 ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమా, ఏడాది పని అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. జీతం రూ. నెలకు రూ. 13 వేలు చెల్లిస్తారు.
ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 8 ఖాళీగా ఉన్నాయి. వీటికి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అర్హత, కంప్యూటర నాలెడ్జ్ ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.13వేలు చెల్లిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 చివరితేది. వెబ్సైట్ : www.tsacs.telangana.gov.in