యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 4న జరగనుంది. ఈ 20 రోజుల ఫైనల్ టైం.. ప్రిపరేషన్లో రివిజన్ చాలా కీలకం. కొత్తగా ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులు టెన్షన్ పక్కన పెట్టి ప్రాక్టీస్‌కు ఎక్కువ టైమ్ కేటాయించాలి. ఈ టైమ్‌లో వేటిపై ఫోకస్ చేయాలి.. ఏమేం రివిజన్ చేసుకోవాలి.. సివిల్స్ కోచింగ్ ఇచ్చే నిపుణులు ఏమేం చెపుతున్నారో.. ఒకసారి మీ అవగాహన కోసం అందిస్తున్నాం…
ప్రిలిమినరీలో రెండు పేపర్లు
జనరల్ స్టడీస్ పేపర్–-1 (200 మార్కులు),
జనరల్ స్టడీస్ పేపర్-–2 (200 మార్కులు). ఈ రెండో పేపర్ అర్హత పరీక్ష. అంటే దీనిలో 67 మార్కులు (33 శాతం) తెచ్చుకుంటేనే పేపర్-–1ను మూల్యాంకనం చేస్తారు.
పేపర్-–1లో ప్రతిభ చూపిన అభ్యర్థులే మెయిన్స్ రాయడానికి అర్హులు.
కాబట్టి ప్రిలిమ్స్ అభ్యర్థులు పేపర్–1పై కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది.
ఇంపార్టెంట్ టాపిక్స్:
ఇప్పుడున్న 20 రోజుల్లో మొత్తం సిలబస్‌ను రివిజన్ చేయడం కష్టం. కాబట్టి కీలకమైన అంశాలను మాత్రమే చదవాలి.
భారత జాతీయోద్యమం,
భారత రాజ్యాంగం,
భౌగోళిక అంశాలు,
సైన్స్ అండ్ టెక్నాలజీ మౌలిక విషయాలు,
సమకాలీన సవాళ్లు,
ఆర్థిక రంగంలో వస్తున్న పరిణామాలు,
చరిత్ర–సంస్కృతి తదితర ఇంపార్టెంట్ టాపిక్స్‌ను గుర్తించి లాస్ట్ రివిజన్‌కు ప్రిపేర్ అవ్వాలి.
తికమక ప్రశ్నలు గుర్తించాలి
ప్రిలిమ్స్ లో వివిధ సబ్జెక్టుల నుంచి అడిగే ప్రశ్నల స్వరూపాన్ని గుర్తించాలి. ఎక్కువ మోడల్ పేపర్స్‌తోపాటు యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే కొంత అర్థమవుతుంది. నేరుగా అడిగే ప్రశ్నలకంటే సమకాలీన విషయాల్ని ఇతర అంశాలతో అనుసంధానించి అడిగేవి, ఒక విషయాన్ని తికమకగా, డిఫరెంట్‌గా అడిగే ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు అలాంటి తరహా ప్రశ్నలపై అవగాహన కలిగి ఉండాలి.
ప్రీవియస్ పేపర్స్;
వివిధ సబ్జెక్ట్స్లోని స్టాటిస్టిక్స్, అంకెలు, స్థానాలు, శాతాలు, వృద్ధిరేటు లాంటి ఫ్యాక్ట్స్ ఎప్పుడో చదివినవి మరిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పడు ఎగ్జామ్ ముందు రివిజన్ చేస్తే గుర్తుంటాయి. ప్రీవియస్ పేపర్స్ టెస్ట్‌లు రాయడం వల్ల ఏయే ఏరియాల్లో వీక్‌గా ఉన్నామో తెలిసిపోతుంది. అలాంటి అంశాలను లిస్ట్ అవుట్ చేసుకోవాలి. వీటితోపాటు ఏయే అంశాలను మరిచపోకుండా చదవాలో వాటిని ఒక జాబితాగా తయారు చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఆధారంగా జనరల్ స్టడీస్‌లోని అంశాలపై ఫోకస్ పెట్టాలి. లిస్ట్ అవుట్ చేసిన ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా చదవాలి.
కరెంట్ అఫైర్స్ కీలకం
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇది మేయిన్స్‌లో కూడా ఓ సబ్జెక్ట్. భారత్ అంతర్జాతీయ సంబంధాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. డబ్ల్యూహెచ్‌వో, డబ్ల్యూటీవో, యూఎన్వో లాంటి సంస్థల అప్డేట్స్, చైనా– భారత్ సరిహద్దు అంశాలు సహా భారత ఇతర దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌లో భాగంగా కొవిడ్–19 తదితర అంశాలపై కూడా ప్రశ్నలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ తయారీ ఇన్స్టిట్యూట్స్, క్లినికల్ ట్రయల్స్ లేటెస్ట్ అప్డేట్స్ తెలిసి ఉండాలి. ఈ ఏడాదిలో ప్రతి నెలా జరిగిన సంఘటనలన్నింటినీ ఒక క్రమంలో అమర్చుకొని రివిజన్ చేస్తే బెటర్. వార్తల వెనక ఉన్న విభాగాల్ని కూడా అనలైజ్ చేయగలగాలి. ఇన్సిడెంట్ ఏంటి? ఎందుకు జరిగింది? దాని వెనక గల పర్యావసానాలు గుర్తించాలి.
పాలిటీలో లేటెస్ట్ అప్డేట్స్పై..
పాలిటీలో కొత్త అంశాలు ఏవీ ఇప్పుడు మొదలు పెట్టొద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చట్టాలు, బిల్లులు, భారత రాజ్యాంగం తాత్విక పునాదాలు, ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు, అధికరణలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వాటిపై కాన్సన్ట్రేట్ చేయాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య సంబంధాలు, ఈ మధ్య కాలంలో జీఎస్టీ పంపిణీ విషయంలో రాష్ట్రాలకు లోటు ఏర్పడటం.. వాటికి రాజ్యాంగ సవరణ నేపథ్యం తదితర అంశాలను అనలైజ్ చేయాలి. రాజ్యాంగపరమైన సంస్థలైన ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, యూపీఎస్సీ, సీఏజీ రీసెంట్ అప్డేట్స్పై దృష్టి పెట్టాలి. సీఏజీని బహుళ సంస్థగా చేయాలని చూస్తున్నారు. దీంతోపాటు వన్ నేషన్.. వన్ ఓటర్‌లిస్ట్, జమిలీ ఎన్నికలు.. 73, 74 రాజ్యాంగ సవరణలు అధికార వికేంద్రీకరణ అంశాలను రివిజన్ చేయాలి. ఎన్హెచ్ఆర్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్లు వాటి నివేదికలు.. రీసెంట్ ఇష్యూస్‌పై ఫోకస్ పెట్టాలి. అయోధ్య నిర్మాణం, ఎస్సీ ఎస్టీ, రిజర్వేషన్లు, వాటి వర్గీకరణ.. తదితర అంశాలు, సుప్రీం కోర్టు తీర్పులు ఒకసారి రివైజ్ చేస్తే సరిపోతుంది.
కొవిడ్–19 తర్వాతి ఎకానమి
కొవిడ్–19 తర్వాత ఇండియన్ ఎకానమిపై ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కొవిడ్ నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్యాకేజీలపై దృష్టి పెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించి జీఎస్టీపై ఫోకస్ పెట్టాలి. దాని బ్రాగ్రౌండ్ చదవాలి. ఎఫ్ఆర్బీఎం, ఫైనాన్స్ కమిషన్, సోషియో ఎకానమిక్ ఇనిషియేటివ్స్ అంశం సిలబస్‌లో మెన్షన్ చేశారు కాబట్టి అభ్యర్థులు ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌పై దృష్టి పెట్టాలి. సస్టేయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు సంబంధించి అప్డేట్స్ చూసుకోవాలి. వ్యవసాయ రంగంపై 5 నుంచి 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సోషియో ఎకానమీ సర్వే ఆధారంగా అగ్రికల్చర్ సెక్టార్ చదవాలి. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, సవాళ్లు, మద్దతు ధర, ఫుడ్ సెఫ్టీ అంశాలు రివిజన్ చేయాలి. ఎంప్లాయ్మెంట్, రివర్స్ మైగ్రేషన్, లేటెస్ట్ రిపోర్ట్స్ స్టడీ చేయాలి. రిజర్వ్ బ్యాంకు మానిటర్ పాలసీలు, కొవిడ్–19 టైంలో ఆర్బీఐ తీసుకొచ్చిన పాలసీలు, వృద్ధి రేటు, జీడీపీ తగ్గుదలకు కారణాలు, ఇంటర్నేషనల్ ఎకానమీలో చైనా ఇండియా ట్రేడ్ తదితర అంశాలు రివిజన్ చేయాలి. ఓవరాల్‌గా బేసిక్స్ మీద ఫోకస్ పెడితే ఎకానమిలో మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు.
సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం
గతేడాది మినహా ప్రతి సంవత్సరం సివిల్స్ ప్రిలిమినరీలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి దాదాపు10 ప్రశ్నల వరకు వచ్చాయి. ఫిజికల్ సైన్స్ లో ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఉష్ణం, యాంత్రిక శాస్త్రం, ద్రవ పదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతిక శాస్త్రంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఫిజిక్స్‌లో సూత్రాలు, నియమాలు, బేసిక్స్ కాన్సెప్ట్స్ అనువర్తనాలపై పోటీ పరీక్షలకు ప్రశ్నలుంటాయి. ఉదాహరణకు ర్యాడార్ ఏ సూత్రాం ఆధారంగా పని చేస్తుంది? లాంటివి. అణుశక్తి, దేశంలో అణు విద్యుత్ కేంద్రాలు, న్యూక్లియర్ టెస్ట్‌లు, స్పేస్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలు, ఇస్రో రీసెంట్స్ అప్డేట్స్, జీఎస్ఎల్వీ, చంద్రయాన్స్, మంగళ్యాన్, గగన్‌యాన్, క్షిపణులు, ఎనర్జీ సోర్సెస్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. బయాలజికల్ సైన్స్‌కు సంబంధించి కొవిడ్–19 వైరస్, గతంలో వచ్చిన వైరస్లు, జెనెటిక్ ఇంజినీరింగ్, వ్యాక్సిన్స్ అంశాలను రివిజన్ చేయాలి.
రోజుకు రెండు టెస్ట్‌లు..
ఈ టైంలో కొత్త అంశాలు చదివితే కన్ఫ్యూజన్ పెరుగుతది. కొన్ని సంస్థలు కొత్త స్టడీ మెటిరియల్స్ అంటూ మార్కెట్లోకి రిలీజ్ చేస్తాయి వాటిని అసలే ముట్టుకోవద్దు. ఇదివరకు చదివింది రివైజ్ చేయడం, వీలైనన్ని ఎక్కువ టెస్ట్ లు చేసి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడున్న 20 రోజుల్లో రోజుకు రెండు చొప్పున కనీసం 30 టెస్టులన్నా చేయగలిగితే బాగా యూజ్ ఉంటుంది. నెట్ నుంచి ఓఎంఆర్ షీట్ ప్రింట్ తీసుకొని బబ్లింగ్ చేస్తూ సీరియస్‌గా టైం ప్రకారమే ఎగ్జామ్ రాస్తే మంచి ప్రాక్టీస్ పెరుగుతుంది. లాస్ట్ 5 డేస్‌లో యూపీఎస్సీ వెబ్సైట్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మంచిది.
ALL THE BEST
CIVIL SERVICES PRELIMINARY EXAMINATION 2019
ANSWER KEYS 2019
General Studies Paper – I (453.59 KB)
General Studies Paper – II (386.06 KB)
CIVIL SERVICES PRELIMINARY EXAMINATION 2018
ANSWER KEYS 2018