HomeLATESTసివిల్స్​ 20 డేస్​ ప్లాన్​​

సివిల్స్​ 20 డేస్​ ప్లాన్​​

యూపీఎస్సీ నిర్వహించే సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్​ 4న జరగనుంది. ఈ 20 రోజుల ఫైనల్​ టైం.. ప్రిపరేషన్​లో రివిజన్​ చాలా కీలకం. కొత్తగా ప్రిలిమ్స్​ రాసే అభ్యర్థులు టెన్షన్ పక్కన పెట్టి ప్రాక్టీస్​కు ఎక్కువ టైమ్​ కేటాయించాలి. ​ఈ టైమ్​లో వేటిపై ఫోకస్​ చేయాలి.. ఏమేం రివిజన్​ చేసుకోవాలి.. సివిల్స్​ కోచింగ్​ ఇచ్చే నిపుణులు ఏమేం చెపుతున్నారో.. ఒకసారి మీ అవగాహన కోసం అందిస్తున్నాం…

Advertisement

ప్రిలిమినరీలో రెండు పేపర్లు
జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–-1 (200 మార్కులు),
జనరల్​ స్టడీస్​ పేపర్‌-–2 (200 మార్కులు). ఈ రెండో పేపర్‌ అర్హత పరీక్ష. అంటే దీనిలో 67 మార్కులు (33 శాతం) తెచ్చుకుంటేనే పేపర్‌-–1ను మూల్యాంకనం చేస్తారు.
పేపర్‌-–1లో ప్రతిభ చూపిన అభ్యర్థులే మెయిన్స్‌ రాయడానికి అర్హులు.
కాబట్టి ప్రిలిమ్స్​ అభ్యర్థులు పేపర్​–1పై కాన్సన్​ట్రేట్​ చేయాల్సి ఉంటుంది.

ఇంపార్టెంట్​ టాపిక్స్​:

ఇప్పుడున్న 20 రోజుల్లో మొత్తం సిలబస్​ను రివిజన్​ చేయడం కష్టం. కాబట్టి కీలకమైన అంశాలను మాత్రమే చదవాలి.
భారత జాతీయోద్యమం,
భారత రాజ్యాంగం,
భౌగోళిక అంశాలు,
సైన్స్​ అండ్​ టెక్నాలజీ మౌలిక విషయాలు,
సమకాలీన సవాళ్లు,
ఆర్థిక రంగంలో వస్తున్న పరిణామాలు,
చరిత్ర–సంస్కృతి తదితర ఇంపార్టెంట్​ టాపిక్స్​ను గుర్తించి లాస్ట్​ రివిజన్​కు ప్రిపేర్​ అవ్వాలి.

తికమక ప్రశ్నలు గుర్తించాలి
ప్రిలిమ్స్​ లో వివిధ సబ్జెక్టుల నుంచి అడిగే ప్రశ్నల స్వరూపాన్ని గుర్తించాలి. ఎక్కువ మోడల్​ పేపర్స్​తోపాటు యూపీఎస్సీ ప్రీవియస్​ పేపర్స్​ గమనిస్తే కొంత అర్థమవుతుంది. నేరుగా అడిగే ప్రశ్నలకంటే సమకాలీన విషయాల్ని ఇతర అంశాలతో అనుసంధానించి అడిగేవి, ఒక విషయాన్ని తికమకగా, డిఫరెంట్​గా అడిగే ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు అలాంటి తరహా ప్రశ్నలపై అవగాహన కలిగి ఉండాలి.

ప్రీవియస్​ పేపర్స్​;
వివిధ సబ్జెక్ట్స్​లోని స్టాటిస్టిక్స్, అంకెలు, స్థానాలు, శాతాలు, వృద్ధిరేటు లాంటి ఫ్యాక్ట్స్​ ఎప్పుడో చదివినవి మరిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పడు ఎగ్జామ్​ ముందు రివిజన్​ చేస్తే గుర్తుంటాయి.​ ప్రీవియస్​ పేపర్స్​ టెస్ట్​లు రాయడం వల్ల ఏయే ఏరియాల్లో వీక్​గా ఉన్నామో తెలిసిపోతుంది. అలాంటి అంశాలను లిస్ట్​ అవుట్​ చేసుకోవాలి. వీటితోపాటు ఏయే అంశాలను మరిచపోకుండా చదవాలో వాటిని ఒక జాబితాగా తయారు చేసుకొని ప్రిపేర్​ అవ్వాలి. ముఖ్యంగా కరెంట్​ అఫైర్స్​ ఆధారంగా జనరల్​ స్టడీస్​లోని అంశాలపై ఫోకస్​ పెట్టాలి. లిస్ట్​ అవుట్​ చేసిన ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా చదవాలి.

కరెంట్​ అఫైర్స్ కీలకం
కరెంట్​ అఫైర్స్​కు సంబంధించి ప్రిలిమ్స్​లో ఇంటర్నేషనల్​ రిలేషన్స్​పై ఎక్కువగా ఫోకస్​ ఉంటుంది. ఎందుకంటే ఇది మేయిన్స్​లో కూడా ఓ సబ్జెక్ట్. భారత్​ అంతర్జాతీయ సంబంధాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. డబ్ల్యూహెచ్​వో, డబ్ల్యూటీవో, యూఎన్​వో లాంటి సంస్థల అప్​డేట్స్​, చైనా– భారత్​ సరిహద్దు అంశాలు సహా భారత ఇతర దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సైన్స్​ అండ్ ఎన్విరాన్​మెంటల్​ ఇష్యూస్​లో భాగంగా కొవిడ్​–19 తదితర అంశాలపై కూడా ప్రశ్నలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ తయారీ ఇన్​స్టిట్యూట్స్​, క్లినికల్​ ట్రయల్స్​ లేటెస్ట్​ అప్​డేట్స్​ తెలిసి ఉండాలి. ఈ ఏడాదిలో ప్రతి నెలా జరిగిన సంఘటనలన్నింటినీ ఒక క్రమంలో అమర్చుకొని రివిజన్​ చేస్తే బెటర్​. వార్తల వెనక ఉన్న విభాగాల్ని కూడా అనలైజ్​ చేయగలగాలి. ఇన్సిడెంట్​ ఏంటి? ఎందుకు జరిగింది? దాని వెనక గల పర్యావసానాలు గుర్తించాలి.

పాలిటీలో లేటెస్ట్​ అప్​డేట్స్​పై..
పాలిటీలో కొత్త అంశాలు ఏవీ ఇప్పుడు మొదలు పెట్టొద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చట్టాలు, బిల్లులు, భారత రాజ్యాంగం తాత్విక పునాదాలు, ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు, అధికరణలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వాటిపై కాన్సన్​ట్రేట్​ చేయాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య సంబంధాలు, ఈ మధ్య కాలంలో జీఎస్టీ పంపిణీ విషయంలో రాష్ట్రాలకు లోటు ఏర్పడటం.. వాటికి రాజ్యాంగ సవరణ నేపథ్యం తదితర అంశాలను అనలైజ్​ చేయాలి. రాజ్యాంగపరమైన సంస్థలైన ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, యూపీఎస్సీ, సీఏజీ రీసెంట్​ అప్​డేట్స్​పై దృష్టి పెట్టాలి. సీఏజీని బహుళ సంస్థగా చేయాలని చూస్తున్నారు. దీంతోపాటు వన్​ నేషన్​.. వన్​ ఓటర్​లిస్ట్​, జమిలీ ఎన్నికలు.. 73, 74 రాజ్యాంగ సవరణలు అధికార వికేంద్రీకరణ అంశాలను రివిజన్​ చేయాలి. ఎన్​హెచ్​ఆర్​సీ, బీసీ​, ఎస్సీ, ఎస్టీ​, మహిళా కమిషన్​లు వాటి నివేదికలు.. రీసెంట్​ ఇష్యూస్​పై ఫోకస్​ పెట్టాలి. అయోధ్య నిర్మాణం, ఎస్సీ ఎస్టీ, రిజర్వేషన్లు, వాటి వర్గీకరణ.. తదితర అంశాలు, సుప్రీం కోర్టు తీర్పులు ఒకసారి రివైజ్​ చేస్తే సరిపోతుంది.

కొవిడ్​–19 తర్వాతి ఎకానమి
కొవిడ్​–19 తర్వాత ఇండియన్​ ఎకానమిపై ప్రిలిమ్స్​లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కొవిడ్​ నేపథ్యంలో ఆత్మ నిర్భర్​ భారత్​లో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్యాకేజీలపై దృష్టి పెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించి జీఎస్టీపై ఫోకస్​ పెట్టాలి. దాని బ్రాగ్రౌండ్​ చదవాలి. ఎఫ్​ఆర్​బీఎం, ఫైనాన్స్​ కమిషన్​, సోషియో ఎకానమిక్​ ఇనిషియేటివ్స్​ అంశం సిలబస్​లో మెన్షన్​ చేశారు కాబట్టి అభ్యర్థులు ప్రభుత్వ ప్రోగ్రామ్స్​పై దృష్టి పెట్టాలి. సస్టేయినబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్​ కు సంబంధించి అప్​డేట్స్​ చూసుకోవాలి. వ్యవసాయ రంగంపై 5 నుంచి 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సోషియో ఎకానమీ సర్వే ఆధారంగా అగ్రికల్చర్​ సెక్టార్​ చదవాలి. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, సవాళ్లు, మద్దతు ధర, ఫుడ్​ సెఫ్టీ అంశాలు రివిజన్​ చేయాలి. ఎంప్లాయ్​మెంట్​, రివర్స్​ మైగ్రేషన్​, లేటెస్ట్​ రిపోర్ట్స్​ స్టడీ చేయాలి. రిజర్వ్​ బ్యాంకు మానిటర్​ పాలసీలు, కొవిడ్​–19 టైంలో ఆర్బీఐ తీసుకొచ్చిన పాలసీలు, వృద్ధి రేటు, జీడీపీ తగ్గుదలకు కారణాలు, ఇంటర్నేషనల్​ ఎకానమీలో చైనా ఇండియా ట్రేడ్​ తదితర అంశాలు రివిజన్​ చేయాలి. ఓవరాల్​గా బేసిక్స్​ మీద ఫోకస్​ పెడితే ఎకానమిలో మంచి మార్కులు స్కోర్​ చేయొచ్చు.

సైన్స్​ అండ్​ టెక్నాలజీ కీలకం
గతేడాది మినహా ప్రతి సంవత్సరం సివిల్స్​ ప్రిలిమినరీలో సైన్స్​ అండ్​ టెక్నాలజీ నుంచి దాదాపు10 ప్రశ్నల వరకు వచ్చాయి. ఫిజికల్​ సైన్స్ లో ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్​, ఉష్ణం, యాంత్రిక శాస్త్రం, ద్రవ పదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతిక శాస్త్రంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఫిజిక్స్​లో సూత్రాలు, నియమాలు, బేసిక్స్​ కాన్సెప్ట్స్​ అనువర్తనాలపై పోటీ పరీక్షలకు ప్రశ్నలుంటాయి. ఉదాహరణకు ర్యాడార్​ ఏ సూత్రాం ఆధారంగా పని చేస్తుంది? లాంటివి. అణుశక్తి, దేశంలో అణు విద్యుత్​ కేంద్రాలు, న్యూక్లియర్​ టెస్ట్​లు, స్పేస్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్​ స్థాయిలో జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలు, ఇస్రో రీసెంట్స్​ అప్​డేట్స్​, జీఎస్​ఎల్​వీ, చంద్రయాన్స్​, మంగళ్​యాన్​, గగన్​యాన్​, క్షిపణులు, ఎనర్జీ సోర్సెస్, ఇన్ఫర్మేషన్​ కమ్యూనికేషన్​ టెక్నాలజీ, ఇంటర్​నెట్​, రోబోటిక్స్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. బయాలజికల్​ సైన్స్​కు సంబంధించి కొవిడ్​–19 వైరస్​, గతంలో వచ్చిన వైరస్​లు, జెనెటిక్​ ఇంజినీరింగ్​, వ్యాక్సిన్స్​ అంశాలను రివిజన్​ చేయాలి.

రోజుకు రెండు టెస్ట్​లు..
ఈ టైంలో కొత్త అంశాలు చదివితే కన్​ఫ్యూజన్​ పెరుగుతది. కొన్ని సంస్థలు కొత్త స్టడీ మెటిరియల్స్​ అంటూ మార్కెట్​లోకి రిలీజ్​ చేస్తాయి వాటిని అసలే ముట్టుకోవద్దు. ఇదివరకు చదివింది రివైజ్ చేయడం​, వీలైనన్ని ఎక్కువ టెస్ట్ లు చేసి సెల్ఫ్​ అసెస్​మెంట్​ చేసుకోవడం ఇంపార్టెంట్​. ఇప్పుడున్న 20 రోజుల్లో రోజుకు రెండు చొప్పున కనీసం 30 టెస్టులన్నా చేయగలిగితే బాగా యూజ్​ ఉంటుంది. నెట్​ నుంచి ఓఎంఆర్​ షీట్​ ప్రింట్​ తీసుకొని బబ్లింగ్​ చేస్తూ సీరియస్​గా టైం ప్రకారమే ఎగ్జామ్​ రాస్తే మంచి ప్రాక్టీస్​ పెరుగుతుంది. లాస్ట్​ 5 డేస్​లో యూపీఎస్సీ వెబ్​సైట్​ ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేస్తే మంచిది.

Advertisement

ALL THE BEST

CIVIL SERVICES PRELIMINARY EXAMINATION 2019

PDF icon General Studies Paper-I
PDF icon General Studies Paper-II

ANSWER KEYS 2019

General Studies Paper – I (453.59 KB)
General Studies Paper – II (386.06 KB)

CIVIL SERVICES PRELIMINARY EXAMINATION 2018

Advertisement
PDF icon General Studies Paper – I
PDF icon General Studies Paper – II

ANSWER KEYS 2018

Paper – I (1.44 MB) 
Paper – II (1.4 MB)

 

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!