HomeLATESTనీట్​ ఎగ్జామ్​కు యూనిఫామ్​.. తాజా గైడ్​లైన్స్​

నీట్​ ఎగ్జామ్​కు యూనిఫామ్​.. తాజా గైడ్​లైన్స్​

కరోనా నేపథ్యం లో రేపటి నీట్​ ఎగ్జామ్​కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అందరి భద్రత,ఆరోగ్య రక్షణ కోసం భౌతిక దూరం పాటిస్తూ ఎన్ టీ ఏ సూచించిన జాగ్రత్తలు అనుసరిస్తూ అభ్యర్థులు ప్రశాంతం గా నీట్ పరీక్షని రాయాలి. సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్​ జరుగుతుంది. దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకొన్నారు. ఏపీ నుంచి 61,892 మంది, తెలంగాణ నుంచి 55,800 మంది పరీక్షకు అప్లై చేసుకున్నారు.

Advertisement

డ్రెస్​ కోడ్​;

హాఫ్​ హ్యాండ్స్​ షర్ట్స్​ (పొట్టి చేతుల చొక్కాలు) ధరించాలి.
పెద్ద పెద్ద గుండీలు ఉండరాదు.
షూస్ వేసుకోకూడదు.
స్లిప్పర్స్ వేసుకోవటం బెటర్​.
బంగారు అభరణాలు నిషిద్ధం.
విద్యార్థులు మాస్కులు, హ్యాండ్​ గ్లౌజులు వెంట తీసుకెళ్ళాలి.
50 ఎంఎల్ శానిటైజర్, ట్రాన్స్ పరెంట్ వాటర్ బాటిల్ అనుమతిస్తారు.
మొబైల్ ఫోన్, వాచ్​, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని అనుమతించరు.

అభ్యర్థులేమేం చేయాలి… ఏమేం వెంట తీసుకెళ్లాలో మరోసారి చెక్​ చేసుకొండి.

Advertisement
  • అభ్యర్థుల హాల్ టికెట్ మూడు పేజీలుంది.దానిలో పాటించవలసిన నియమాలతో పాటు అభ్యర్థులు తమ ఆరోగ్య స్థితిని తెలియచేసే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా ఉంటుంది.
  • పాస్ పోర్ట్ ఫొటోని దానిపై అంటించి,ఎడమచేతి బొటనవేలి ముద్ర వేసుకొని,తల్లి లేదా తండ్రి సంతకం పెట్టించుకొని ఆ ఫారం ని కచ్చితం గా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్ళాలి.
  • దీంతో పాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ వంటి ఏదేని గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి.
  • అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోనికి తమ అడ్మిట్ కార్డు లో ఇచ్చిన టైం లోనే వెళ్ళాలి.
  • ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులని పరీక్షా కేంద్రాలోనికి అనుమతిస్తారు.
  • ఎంట్రీ గేట్​ వద్దే టెంపరేచర్ చెక్ చేస్తారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!