HomeLATESTటెట్​ 2025 అప్లికేషన్లకు ఈ రోజే ఆఖరు

టెట్​ 2025 అప్లికేషన్లకు ఈ రోజే ఆఖరు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2025) అప్లికేషన్లకు గడువు ఈ రోజుతో ముగియనుంది. గతంతో పోలిస్తే ఈసారి టెట్​కు దాదాపు సగం దరఖాస్తులు తగ్గాయి. మంగళవారం రాత్రి వరకు 1.36 లక్షల మంది అభ్యర్థులు ఫీజు చెల్లించారు. వారిలో 1.34 లక్షల మంది దరఖాస్తు సమర్పించారు. ఈ రోజు చివరి గడువు ఉన్నందున మొత్తం దరఖాస్తులు 1.50 లక్షలకు మించకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడానికి పలు కారణాలున్నాయి. గతేడాది ప్రభుత్వం రెండుసార్లు టెట్​ నిర్వహించింది. చివరిసారిగా గత జనవరిలో నిర్వహించిన టెట్‌-2024 పరీక్షకు 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 2,05,278 మంది పరీక్ష రాశారు. మళ్లీ నాలుగు నెలలకే నోటిఫికేషన్​ రావటంతో కొత్తగా డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులు ఎక్కువగా లేకపోవటం ప్రధాన కారణం. మరోవైపు ఎన్నిసార్లు రాసినా మార్కులు పెరిగే అవకాశం లేదని అభ్యర్థులు కొందరు ఈ పరీక్షకు దూరంగా ఉంటున్నారు.

ఈసారి టెట్ పరీక్షలు జూన్​ 15-30వ తేదీ మధ్యలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలను దూరంగా వేస్తున్నారనే కారణంతో అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గత జనవరిలో జరిగిన పరీక్షకు ఏకంగా 70 వేల మంది గైర్హాజరయ్యారు.

ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్‌-1, ఉన్నత పాఠశాలల్లో (6-10 తరగతులు) బోధనకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీలకు-90, బీసీ-75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు.

📘 TS TET 2025 – Quick Guide

All essential Telangana TET 2025 details in one place – official links, syllabus, and previous papers.

🔗 Official Portal

Visit TS TET Official Website

📚 Syllabus

✔️ Paper I – For Classes I to V
✔️ Paper II – For Classes VI to VIII

Download Syllabus

📄 Previous Papers

📝 Practice with past TS TET question papers:

View on Merupulu

📊 Results

🗓️ Declared on: Feb 5, 2025

Check 2025 Result

🔎 View Previous Results
merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!