టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు సాయంత్రం 5 గంటల నాటికి 2072 మంది ఫీజు చెల్లించినట్టు టెట్ కన్వీనర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 1890 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 558 మంది, పేపర్ 2కు 1101 మంది, రెండు పేపర్లకు 231 మంది అభ్యర్థులు అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు.
తొలి రోజున సర్వర్ ప్రాబ్లమ్ తో టెట్ పేమెంట్స్ కొంత ఆలస్యమవటంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. అప్లికేషన్ నమోదు చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురైనా.. టెట్ హెల్ప్ డెస్క్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. టెట్ అప్లికేషన్లకు ఈనెల 30వ తేదీ వరకు తుది గడువుంది.
టెట్ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు దరఖాస్తు చేస్తే రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనవరిలో జరిగిన 2024 టెట్ పరీక్షకు 2,75,753 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 2,05,278 మంది పరీక్ష రాశారు. ఇందులో 83,711 మంది డీఎస్సీకి అర్హత పొందారు. ఈ ఏడాది టెట్‌కు దాదాపు రెండు లక్షల మంది పోటీపడే అవకాశం ఉంది.