Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS16 నుంచి గ్రూప్​ 1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్​.. 563 అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీజీపీఎస్​సీ

16 నుంచి గ్రూప్​ 1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్​.. 563 అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీజీపీఎస్​సీ

తెలంగాణ గ్రూప్​ 1 అభ్యర్థుల తుది మెరిట్​ జాబితాను టీజీపీఎస్​సీ ప్రకటించింది. 563 గ్రూప్​ 1 సర్వీసు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు, ర్యాంకులు ఇటీవలే విడుదలయ్యాయి. మార్కుల మెరిట్​, రిజర్వేషన్ల ఆధారంగా 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను తాజాగా ప్రకటించింది. గ్రూప్‌-1లో ఇంటర్వ్యూలు లేకపోవడంతో 1:2కి బదులుగా నేరుగా 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు పిలిచింది.

మెయిన్స్​ లో మార్కులు, రిజర్వేషన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను పరిగణనలోకి తీసుకుని 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్​సీ ప్రకటించింది. ఈ జాబితాను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. మెరిట్‌ జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ నిర్వహించనుంది. అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం నిర్ణీత తేదీల్లో హాజరు కాకున్నా, ఎవరివైనా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నా… వారికి 22వ తేదీన చివరి అవకాశం కల్పించారు.

అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను, వాటి రెండు సెట్ల జిరాక్సు ప్రతులతో సర్టిఫికెట్​ వెరిఫికేషన్​కు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఆప్షన్లు నమోదు చేయకపోయినా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు హాజరు కాకపోయినా, ఎవరిదైనా అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా వారి స్థానంలో తదుపరి మెరిట్‌ అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తామని టీజీపీఎస్​సీ ప్రకటించింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!