బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు: మొత్తం 592 పోస్టుల్లో రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.bankofbaroda.in వెబ్సైట్లో సంప్రదించాలి