HomeLATESTఎస్​బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్​ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

ఎస్​బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్​ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో 1,511 స్పెషలిస్ట్ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్​ వెలువడింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI). స్పెషలిస్ట్ కేడర్​ ఆఫీసర్​ పోస్టుల నియామకాలకు జారీ చేసిన నోటిఫికేషన్​ గడువును పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవమున్న వారు ఈ పోస్టులకు అర్హులు. డిప్యూటీ మేనేజర్‌లకు నెలకు రూ.64,820- రూ.93,960. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480- రూ.85,920 వేతనం ఉంటుంది.

పోస్టులు:
1. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ: 187 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్: 412 పోస్టులు
3. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌: 80 పోస్టులు
4. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు
5. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు
6. అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు

వయోపరిమితి: 30.06.2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 14.09.2024 నుంచి 14.10.2024 వరకు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!