రైల్వే జోన్లలో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆర్‌ఆర్‌బీ ఇప్పటికే 9,144 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 959 ఖాళీలున్నాయి. అత్యధికంగా చెన్నై జోన్‌లో 2716; అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టులు–ఖాళీలు: మొత్తం 14,298 పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్ లైన్): 1,092, టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్ లైన్): 8,052, టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్ అండ్ పీయూఎస్): 5,154 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు: టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: బీఎస్సీ, బీఈ/ బీటెక్, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణలై ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III: టెన్త్, ఐటీఐ లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్) ఉత్తీర్ణలై ఉండాలి. వయసు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18 నుంచి -36 ఏళ్లు. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18 నుంచి -33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200 జీతం. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 బేసిక్ వేతనం చెల్లిస్తారు.
సెలెక్షన్: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు, 10 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (15 ప్రశ్నలు, 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (20 ప్రశ్నలు, 20 మార్కులు), మ్యాథ్స్ (20 ప్రశ్నలు, 20 మార్కులు), బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథ్స్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్ సైన్స్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు, 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.rrbsecunderabad.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.