దేశ వ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఖాళీ సీట్లను భర్తీ (lateral entry) చేస్తారు. నవోదయ విద్యాలయాల్లో లేటరల్ ఎంట్రీకి ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్లు చేపడుతారు. ఎంట్రన్స్ రాసేందుకు అర్హులైన విద్యార్తుల నుంచి అప్లికేషన్లకు తాజా నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 30వ తేదీ వరకు తుది గడువు విధించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో ఉచిత విద్య, వసతి సదుపాయం ఉంటుంది. బాలబాలికలకు వేర్వేరుగా ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.cbseitms.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.