సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 12 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆసక్తి అర్హతలున్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ఈనెల 5వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించింది.
మొత్తం ఖాళీలు 12
- సైంటిస్ట్ సి(మెడికల్/నాన్ మెడికల్): 3
- డీఈఓ (డేటా ఎంట్రీ ఆపరేటర్). 2
- రీసెర్చ్ అసోసియేట్: 1
- ప్రాజెక్ట్ అసిస్టెంట్: 2
- రీసెర్చ్ అసిస్టెంట్: 2
- ల్యాబ్ టెక్నీషియన్: 1
- ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్-3: 1
అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎండీ/ఎంఎస్/డీఎ నీబీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు సైంటిస్ట్ సి పోస్టుకు రూ.67,000; డీఈఓకు రూ.20,000; రీసెర్చ్ అసోసియేట్కు రూ.56,840; ప్రాజెక్ట్ అసిస్టెంట్ కు రూ.32,350- రూ.33,700; రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.28,000, ల్యాబ్ టెక్నీషియన్కు రూ.20,000,
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్స్ట్, ఇంటర్వ్యూ
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 5
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 8
దరఖాస్తు: ఆఫ్ లైన్ ద్వారా గాంధీ మెడికల్ కాలేజ్, ప్రిన్సిపల్, జీఎంసీ, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.