Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​‌‌‌‌ తెలంగాణ –(జనవరి 2020)

కరెంట్​ అఫైర్స్​‌‌‌‌ తెలంగాణ –(జనవరి 2020)

తెలంగాణ

కైట్ ఫెస్టివల్

తెలంగాణ సాంస్కృతిక జీవనంలో భాగమైన కైట్ ఫెస్టివల్‌ను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. జనవరి 13 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌తో పాటు ఇంటర్నేషనల్ స్వీట్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.

పూర్ణ రికార్డు

అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన మహిళగా రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణ ఇటీవల 16,050 అడుగుల ఎత్తున్న అంటార్కిటికాలోని ఎత్తయిన శిఖరం విన్సన్ మాసెఫ్ పర్వతాన్ని అధిరోహించారు. దీంతో ఆరేళ్ల కాలంలో ఆరు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించారు. ఇక ఉత్తర అమెరికాలోని మెకన్లీ/దెనాలి శిఖరం మాత్రమే మిగిలి ఉంది.

నూతన సీఎస్ సోమేశ్

రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సీఎస్‌గా కొనసాగిన ఎస్‌కే జోషి స్థానంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమేశ్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన స్వస్థలం బిహార్. 2023 డిసెంబర్‌ 31 వరకు సోమేశ్‌కుమార్‌ సీఎస్‌గా కొనసాగనున్నారు. ఇప్పటి వరకు సీఎస్‌గా పనిచేసిన ఎస్‌కే జోషిని నీటిపారుదల సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.

సువిధ యాప్

రైల్వే సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు తీసుకొచ్చిన రైలు సువిధ యాప్‌ను  దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లలో అన్ని స్టేషన్‌లలో ప్రవేశపెట్టనున్నారు. రైల్వే స్టేషన్‌లలో ఏసీ, సాధారణ, విశ్రాంత గదులు, హోటళ్లు, టీస్టాల్‌లు, దివ్యాంగులకు వీల్‌చైర్లు, మరుగుదొడ్ల సమాచారాన్ని ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు.

ఇండియన్ ఇంజినీరింగ్ సమ్మిట్

34వ ఇండియన్ ఇంజినీరింగ్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఈ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో మెకానికల్ ఇంజినీరింగ్ డిజైన్ రంగంలో హైదరాబాద్‌కు చెందిన ఎన్.కిశోర్‌‌కు నేషనల్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఫోరం అవార్డు అందుకున్నారు.

నుమాయిష్

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)ను జనవరి 1న ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ సొసైటీ 18 కాలేజీలను నిర్వహిస్తూ 35వేల మంది విద్యార్థులను చదివిస్తోంది. నుమాయిష్‌లో భద్రత ప్రమాణాలను నెలకొల్పేందుకు రూ.3 కోట్లతో రక్షణ చర్యలను చేపట్టింది.

ఇస్కా ట్రావెల్ అవార్డు

బెంగుళూర్‌‌లో జనవరి 3నుంచి 7వరకు నిర్వహించిన 107వ సైన్స్ కాంగ్రెస్ ఉత్సవాలలో మహబూబ్‌నగర్ జిల్లా కంబంపల్లి స్కూల్‌కు చెందిన అంజలికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్–ఇస్కా అవార్డు లభించింది. ‘రెండేళ్లలో సైన్స్ ప్రభావితం చేసిన అంశాలు–కారణాలు’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఈమె విజేతగా నిలిచింది.ఇజ్రాయిల్‌ సైంటిస్ట్ అదాయోనాథ్ చేతులమీదుగా అంజలి ఈ అవార్డు అందుకున్నారు. 

బయో ఆసియా సదస్సు

హైదరాబాద్​ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌‌(హెచ్‌ఐసీసీ)లో జనవరి 17 నుంచి 19 వరకు 17వ బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు స్విట్జర్లాండ్ భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తుండగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ‘టుడే ఫర్ టుమారో’ థీమ్‌తో జరగనున్న ఈ సదస్సుకు 55 దేశాల నుంచి 1800 మంది ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగ నిపుణులు, ప్రతినిధులు హాజరుకానున్నారు.

వింగ్స్ ఇండియా

కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ వైమానిక సదస్సు  ‘వింగ్స్ ఇండియా–2020’ కార్యక్రమానికి  హైదరాబాద్​ వేదిక కానుంది.  మార్చి 12 నుంచి 15వరకు  బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ ప్రదర్శనలు  జరగనున్నాయి.  ఇందులో భాగంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

భరోసా సెంటర్

మహిళలు, చిన్నారులకు ఎదురయ్యే వేధింపుల నుంచి స్వాంతన కలిగించేందుకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. రూ. 70లక్షలతో నిర్మించనున్న ఈ కేంద్రానికి గెయిల్ ఇండియా ఆర్థికసాయం అందిచనుంది.

అప్గన్ కాన్సులేట్

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్గనిస్థాన్ కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో జనవరి 8న ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి నహీద్ ఎసర్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి  ప్రారంభించారు. ఇండియా – అప్గన్ దేశాల మధ్య బలమైన సంబంధాలకు, వ్యాపారాభివృద్ధికి ఈ కార్యాలయం ఏర్పాటు తోడ్పడనుంది. ఇది దేశంలోనే రెండో కాన్సులేట్. మొదటిది ముంబయిలో ఏర్పాటు చేశారు. అప్గనిస్థాన్ దౌత్య కార్యాలయం(ఎంబసీ) మాత్రం న్యూఢిల్లీలో ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్

రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని కృత్రిమ మేథా  (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్) సంవత్సరంగా ప్రకటించింది  2021 నాటికే  ఏఐ రంగంలో  8 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.  ఈ అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో 2020 ని కృత్రిమ మేథా ఏడాదిగా ప్రకటించారు.ఈ మేరకు బీటెక్ కోర్సులలో ఏఐ సిలబస్ చేర్చునున్నారు.

గ్లోబల్ ఆసియా–పసిఫిక్ సమావేశం

జనవరి 15,16 తేదీల్లో  హైద్రాబాద్ కేంద్రంగా గ్లోబల్ ఆసియా–పసిఫిక్ సమావేశం నిర్వహించారు. భారత పర్యావరణ,అటవీ, వాతావరణ పరివర్తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 40 దేశాలకు చెందిన కోఆర్డినేటర్లు హాజరయ్యారు. 

బసవ కృషి పురస్కారం

అఖిల భారత లింగాయత్ పంచమశాలి మహాపీఠం బసవ కృషి పురస్కారానికి తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్‌ ఎంపికయ్యారు. కర్ణాటక లోని ప్రథమ జగద్గురు బసవ మృత్యుంజయ స్వామిజీ పేరుతో ప్రతియేటా కర్ణాటక ప్రభుత్వంఈ అవార్డును అందజేస్తోంద. గతంలో ఈ అవార్డును  ప్రముఖులు అన్నా హజారే, మేథాపాట్కర్, మాణిక్ సర్కార్‌‌ తీసుకున్నారు.

పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛ దర్పణ్​

పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛ దర్పణ్ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జనవరి 12న జరిగిన కార్యక్రమంలో పాణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల చేతుల మీదుగా  పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అవార్డును అందుకున్నారు.  పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ అవార్దు దక్కింది.

గిన్నిస్ రికార్డు

హైదరాబాద్​ కు చెందిన  ఆష్మాన్ తనేజ అనే ఐదేండ్ల కుర్రాడు గిన్నిస్ రికార్డు సృష్టించాడు.  తైక్వాండో లో మోకాళ్లపై గంటకు 1200 విన్యాసాలు చేసి  అబ్బురపరిచాడు.  వరల్డ్ ఓపెన్  తైక్వాండో లో అధ్బుతమైన ప్రతిభతో సిల్వర్ పతకం సాధించాడు. 

హైదరాబాద్‌లో థాయ్‌ ఉప ప్రధాని

భారత్‌లో అధికారిక పర్యటలో భాగంగా థాయ్‌లాండ్ ఉప ప్రధాని జురిన్ లక్సానవిస్ట్  జనవరి 19న హైదరాబాద్​ సందర్శించారు. దీనిలో భాగంగా చార్మినార్, చార్ కమాన్, మచిలికమాన్, కలికమాల్, షేర్ ఏ బైహతుల్ కమాన్‌ లను సందర్శించారు. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో అతిపెద్ద థాయ్ పర్నిచర్ పార్కు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది.

తరుణ్ జోషి పర్వతారోహణ

హైదరాబాద్‌ పోలీస్ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి 4892  మీటర్ల ఎత్తైన విన్సన్ మాసెఫ్​ శిఖరాన్ని అధిరోహించింది. అంటార్కిటికా ఖండంలో  ఎత్తైన ఈ శిఖరాన్ని   11గంటల 40 నిమిషాల్లో అధిరోహించింది. 2019 ఆగస్టులో ఇండోనేషియాలోని సఫవా ద్వీపంలోని 4884 మీటర్ల ఎత్తైన క్సోజెన్జ్ శిఖరాన్ని కూడా అధిరోహించింది.

వైమానిక రంగ సదస్సు

విమానయానం అంతరిక్ష రంగానికి సంబంధించి భవిష్యత్ అవకాశాలు, స్కూళ్లపై అంతర్జాతీయ సదస్సు 2020 ఫిబ్రవరి 2లేదా 3వ తేదీన హైదరాబాద్‌లోని నల్సార్  యూనివర్సిటీలో జరగనుంది.  అమెరికా మిస్సిస్సిపి లా యూనివర్సిటీ ఇందులో భాగస్వామ్యం కానుంది.

టీఎస్‌ శక్తి యాప్‌

రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాలను ప్రధాన కార్యాలయంతో అనుసంధానం చేస్తూ తెలంగాణ జెన్‌కో టీఎస్‌ శక్తి యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా జెన్‌కో కార్యకలాపాల పేపర్‌‌లేస్‌ గా మారాయి.  ఈ యాప్‌కు కంప్యూటర్ సొసైటీ యాప్ ఇండియా, జాతీయ స్థాయి పురస్కారం ఈ–పరిపాలన విభాగంలో అందజేసింది.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు

వ్యవసాయ విస్తరణ, పరిశోధన, ఉత్తమ బోధన, యువత నైపుణ్యాలను పెంపొందించడం పరీక్షల నిర్వహణ, డిజిటల్ విధానంలో చేసిన కృషికి గాను ‘అఖిల భారత వ్యవసాయ స్టూడెంట్స్ యూనియన్ ’ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ–2019 పురస్కారానికి ఎంపికైంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!