- ఉక్రెయిన్ లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిని రష్యా క్షిపణి దాడిలో ధ్వంసమైంది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై రష్యా క్షిపణితో దాడికి పాల్పడింది.
- తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48గంటలపాటు నిషేధం విధించింది. ఈ నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్ షోలు , మీడియాతో మాట్లాడకూడదు.
- దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్సంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు ఇండియాకు వచ్చారు. వీరితో బీజేపీ అధ్యక్షుడు జే.పి నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ . జైశంకర్ కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు.
- వస్తు, సేవల పన్ను వసూళ్లు తొలిసారిగా రూ. 2లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్ లోని ఇవి రూ. 2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ. 1.87 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 12.4శాతం అధికం.
- సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో అనే ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఓ దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది.
లేటెస్ట్ కరెంట్ ఆఫైర్స్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS