సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షలు లేదా 10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు పొందడానికి కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. బోర్డు ఎగ్జామ్ 2024కి ముందు ప్రతి సబ్జెక్టుకు సమయం కేటాయించాలి. ఇలా చేస్తే మీరు సులభంగా 95శాతం కంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు.
ఎలా సిద్ధం కావాలి:
బోర్డు ఎగ్జామ్ 2024 కోసం ప్రిపేర్ అయ్యేందుకు డేట్ షీట్ విడుదల కోసం వేచి ఉండాల్సిన పనిలేదు. మీరు ఇంకా ప్రతి సబ్జెక్టును రివైజ్ చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
- నిర్ణీత స్థలం ఏర్పరుచుకోవాలి:
నేటికాలంలో చాలా మంది ఇళ్లలో పిల్లలకు ఒక గదిని ఏర్పాటు చేస్తున్నారు. సొంత గతి లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ స్థలం మార్చే బదులుగా ఇంట్లో ఒక గతి లేదా మూలన మీ స్టడీ స్పేస్ ను ఏర్పాటు చేసుకోండి. అక్కడ చదువుకోండి. దీని వల్ల మీ మనసు చదువు నుంచి ఇతరవాటిపైకి మళ్లించదు. - ఫర్నీచర్:
కొంతమంది పిల్లలకు తమకు నచ్చినప్పుడు చదువుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మనసులో విషయాలు ఎక్కువ కాలం ఉండవు. మీరు టేబుల్, కుర్చీలో కూర్చుని చదువుకుంటే మంచిది. ఇది అధ్యయన వాతావరణాన్ని సృష్టించడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది. మరింత ఏకాగ్రతతో చదువుతారు. - స్టడీ షెడ్యూల్:
స్కూల్ లో చదువుకునేందుకు గంటలను నిర్ణయించినట్లుగానే..ఇంట్లో చదవుకునేటప్పుడు కూడా అదే షెడ్యూల్ ను రూపొందించుకోండి. దీంతో మీరు రోజంతా దినచర్యను సరిచేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టుకు సమాన సమయాన్ని కేటాయిస్తారు. విశ్రాంతి తీసుకుంటే మీ ప్రిపరేషన్ పూర్తి కాదు. పరీక్ష సమయంలో సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది. - సోషల్ మీడియాకు దూరంగా:
చాలా మంది యువత సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. అయితే పరీక్షలకు ముందు ఈ వ్యసనానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు ట్రెండింగ్ రీల్స్, ఫొటోలు చూస్తూ రోజూ చాలా సమయం వేస్ట్ చేస్తుంటారు. చదువుపై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది. కొన్నినెలల పాటు మీ ఫోన్ లో అధ్యయన సంబంధిత యాప్స్ మాత్రమే ఉంచుకునే ప్రయత్నం చేయండి. - విరామం:
ప్రీ బోర్డ్ ఎగ్జామ్ కు ముందు విద్యార్థులపై అధ్యయన ఒత్తిడి పెరుగుతుంది. అందరూ చదువులు, పరీక్షల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. బోర్డు ఎగ్జామ్ లో మెరుగైన మార్కులు పొందేందుకు మానసికంగా అధ్యయనం చేయడం, ఫలితాల భయాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. ప్రతి కొన్ని గంటలకు విరామం తీసుకోవాలి.