తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల కీ విడుదలయ్యింది. సెప్టెంబర్ 12 నుంచి ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 సబ్జెక్టులకు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహించారు. ఇంగ్లీష్, బాటనీ, ఎకనామిక్స్, మ్యాథ్స్ కీ గత నెల 22న రిలీజ్ అయ్యింది. మిగతా సబ్జెక్టులకు కీ ఈరోజు (అక్టోబర్19) విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ కీ సంబంధించిన పూర్తి వివరాలు టీఎస్ పీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది.
ఇది కూడా చదవండి: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677పోస్టులు
కాగా ఈ తుది కీలో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎల్లండిలో సాయంత్రం ( శనివారం సాయంత్రం) 5గంటలలోపు సమర్పించవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. శనివారం సాయంత్రం 5 తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోమని వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు https://www.tspsc.gov.in/ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగలరు.

