వాయిదా పడ్డ గ్రూప్ 2 (TSPSC GROUP 2 Exam) పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. సీఎం సూచనల మేరకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనకు దిగటం, ప్రభుత్వం జోక్యం చేసుకోవటంతో ఆగస్ట్ 29, 30వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. తిరిగి నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్ 2, 3వ తేదీన ఉదయం పేపర్ 3, మధ్యాహ్నం పేపర్ 4 నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
