తెలంగాణలో 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 19వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా ప్రకటించింది.
ఎంపీహెచ్ఏ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు తెలంగాణ స్టేట్ నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ లో రిజిష్టేషన్ చేసుకొని ఉండాలి. లేదా ఇంటర్ వొకేషనల్ (ఎంపీహెచ్ఏ) కోర్సు పూర్తి చేసి ఏడాది పాటు గుర్తింపు పొందిన హాస్పిటళ్లలో అప్రెంటిష్షిప్ చేసిన అనుభవం ఉండాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. 18 ఏళ్ల వయస్సు నుంచి గరిష్ఠంగా 44 ఏళ్లకు మించని వారందరూ ఈ పోస్టులకు అర్హులవుతారు.
రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో వచ్చే మార్కులకు 80 పాయింట్లు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసిన సేవల అనుభవానికి 20 పాయింట్లు కేటాయిస్తారు. వీటితో పాటు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల కోటాను పరిగణనలోకి తీసుకొని పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్లో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో పరీక్ష కేంద్రాలుంటాయి. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు. పరీక్ష సిలబస్, జోన్ల వారీగా పోస్టుల ఖాళీల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. దీంతో పాటు డిటైయిల్డ్ నోటిఫికేషన్ పీడీఎఫ్ కూడా దిగువన ఉంది.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు

పేపర్ సిలబస్
