గ్రూప్ 2 అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ అవకాశం ఇచ్చింది. ఈనెల 8 నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ పేరు, ఆధార్ కార్డు నంబర్, పుట్టిన తేదీ తదితర వివరాల్లో మార్పులు చేసుకోవాలంటే అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ ఒకేసారి ఉంటుందని, కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఎడిట్ చేయాలని టీఎస్పీఎస్సీ సూచించింది. మొత్తం 18 విభాగాల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 5.51 లక్షల మంది అభ్యర్థులు ఈ పోస్టులకు
అప్లై చేసుకున్నారు. వచ్చేనెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.
