అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అభ్యర్థులు పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు తమ హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో (https://www.tspsc.gov.in/) నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని మంత్రి తెలిపారు. పరీక్షలకు సంబంధించి మాక్ టెస్ట్ లింక్ సైతం అధికారిక వెబ్సైట్లో ఉన్నదని టీఎస్పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఆ లింక్ ద్వారా మాక్ టెస్ట్ రాసి ముందుగా ప్రిపేర్ కావాలని టీఎస్పీఎస్సీ సూచించింది.