HomeJEEclass 11రేపే ఇంటర్ ఫలితాలు.. ఈ వారంలోనే టెన్త్ ఫలితాలు

రేపే ఇంటర్ ఫలితాలు.. ఈ వారంలోనే టెన్త్ ఫలితాలు

UPDATED RESULT POST

ఫలితాలు ఇంటర్​ బోర్డు అఫిషియల్​ వెబ్​సైట్ https://tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ రిజల్ట్స్​ మార్కులు తెలుసుకునేందుకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్​ అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఏదో ఒక లింక్​ ద్వారా తమ మార్కులు తెలుసుకోవచ్చు.

CLICK HERE FOR INTER 1st YEAR RESULTS

CLICK HERE FOR INTER 2nd YEAR RESULTS

CLICK HERE FOR INTER 1st YEAR VOCATIONAL

CLICK HERE FOR INTER 2nd YEAR VOCATIONAL

మే 9న ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్​ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు సాయంత్రం నుంచి విద్యార్థులు మార్కుల మెమోలు కలర్ ప్రింట్​లు డౌన్​లోడ్ చేసుకోవచ్చని ఇంటర్​ బోర్డ్ సెక్రెటరీ నవీన్​ మిట్టల్​ ప్రకటించారు.

ఇంటర్‌ ఫలితాల విడుదలకు తెలంగాణ ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 9 వ తేదీన (రేపు ఉదయం 11 గంటలకు) ఇంటర్ ఫలితాలు విడుదల చేయనుంది. నాంపల్లి లోని ఇంటర్ బోర్డు ఆఫీస్ లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. షెడ్యూలు ప్రకారం మంగళవారం ఉదయం ఫలితాలు వెల్లడిస్తారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫస్ట్‌ ఇయర్, సెకండియర్‌ కు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 9.47లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరందరూ ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

రిజల్ట్స్ వెల్లడించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి ఫలితాల్లో ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఇంటర్‌ రిజల్ట్స్ అందించాలని ఇంటర్‌ బోర్డు కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. అందుకే ఫలితాల వెల్లడికి కొంత ఎక్కువ సమయం తీసుకున్నట్లు చెబుతోంది.

TS INTER RESULTS 2023 DIRECT LINK

ఇంటర్ ఫలితాలు వెలువడగానే అఫిషియల్ వెబ్​సైట్​ http://tsbie.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ రిజల్ట్ వెంటనే తెలుసుకునేందుకు ఫలితాల డైరెక్ట్ లింక్​ మెరుపులు.కామ్​లో అందుబాటులో ఉంది.

ఇంటర్​ తర్వాతే టెన్త్ ఫలితాలు

ఇంటర్ ఫలితాలు వెల్లడించిన తర్వాత నాలుగు రోజుల్లో టెన్త్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 15వ తేదీలోపు టెన్త్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 25వ తేదీ నాటికి వాల్యుయేషన్ ప్రక్రియ కూడా ముగిసిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పుడు జరుగుతున్న ఏర్పాట్ల ప్రకారం మే 15వ తేదీలోపు టెన్త్‌ ఫలితాలను వెల్లడించే అవకాశముంది. అయితే.. ఫలితాల విడుదల తేదీపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

TS TENTH RESULTS 2023 DIRECT LINK

తెలంగాణ టెన్త్ ఫలితాలు (SSC PUBLIC EXAMS RESULTS 2023) వెలువడగానే అఫిషియల్ వెబ్​సైట్ https://bse.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ హాల్​ టికెట్​ నెంబర్​ ఎంటర్​ చేసి మార్క్స్​ మెమో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ మార్కుల వివరాలు తెలుసుకునేందుకు ఫలితాల డైరెక్ట్ లింక్​ మెరుపులు.కామ్​లో అందుబాటులో ఉంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!